వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

corona virus: సార్క్ దేశాల అత్యవసర నిధి, 10 మిలియన్ డాలర్లు ఇస్తామని మోడీ ప్రకటన

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంటే.. ఆయాదేశాలు కూడా తగినచర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావించారు. ఈ మేరకు సార్క్ దేశాధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్‌ను నివారించేందుకు అత్యవసర నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం భారతదేశం 10 మిలియన్ల అమెరికా డాలర్లతో నిధిని సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆదివారం సార్క్ దేశాధినేతలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వైరస్‌ను నిర్మూలన కోసం వైద్యులు, నిపుణులతోపాటు వైద్య పరీక్షల కోసం ఉపయోగించే కిట్లు, వస్తువులను సమకూరుస్తామని మోడీ తెలిపారు. ఏ దేశంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే వారిన అందజేయొచ్చు అని ప్రతిపాదించారు. భారతదేశంలో ఉపయోగించినట్టు వైరస్ నియంత్రణ కోసం ఇతరదేశాలకు కూడా సాయపడుతామని పేర్కొన్నారు. వైరస్ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ డీసిజ్ సర్వెలైన్స్ పోర్టల్ (ఐడీఎస్పీ)తో సార్క్ భాగస్వామమవుతోందని మోడీ పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు వేదికను ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.

 PM narendra Modi proposes Covid-19 Emergency Fund..

కరోనా వైరస్ నిర్మూలన కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ పనిచేస్తుందని మోడీ తెలిపారు. వైరస్ నిర్మూలన కోసం పనిేస్తున్నారని ఇండికేషన్స్ ఇచ్చారు. ఇతర దేశాలు, సంస్థలు కూడా సాయం చేయలని కోరారు. సార్క్ సదస్సులో వైరస్‌ను ఎదుర్కొనేందుకు నిధులు, కృషి చేస్తున్నామని మోడీ చెప్పి... ఇతర దేశాల మద్దతు కూడగట్టారు. సభ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు ఓకే ఆయా దేశాలు సానుకూలంగా ఉన్నాయి.

English summary
Prime Minister Narendra Modi while addressing leaders of SAARC member nations proposed the creation of a Covid-19 Emergency Fund
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X