వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్గిల్ ప్రజల దేశభక్తిపై నరేంద్రమోడీ, పాక్‌కి దమ్ములేదని

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: కార్గిల్ ప్రజల దేశభక్తిని చూసి దేశం గర్విస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం అన్నారు. జమ్ము కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఆయన కార్గిల్‌లో ఏర్పాటు చేసిన 44 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు. లెహ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

కార్గిల్‌తో ఇతర ప్రాంతాల సంబంధాలు మెరుగుపరుస్తామన్నారు. కార్గిల్‌లో పారిశ్రామిక ప్రగతి సాధిస్తామన్నారు. రక్షణ బలగాలను సాంకేతికంగా బలోపేతం చేస్తామన్నారు. పాక్ సైన్యం భారత్‌ను ఎదుర్కొనేందుకు కవ్వింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. పాకిస్తాన్ ప్రాయోజిత తీవ్రవాదం అంతమొందాలన్నారు.

సరిహద్దు వద్ద పాక్ కవ్వింపు చర్యలను మోడీ ఖండించారన్నారు. జమ్ము కాశ్మీర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లెహ్ ప్రాంత బలమేంటో తనకు తెలుసని, లడఖ్ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు కూడా తనకు తెలుసన్నారు. ప్రజల ప్రేమే తనను ఇక్కడికి రప్పించిందన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

జమ్ము కాశ్మీర్‌కు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్చించే శక్తి ఉందని మోడీ పేర్కొన్నారు. కాశ్మీర్ లో కుంకుమ విప్లవం తీసుకొస్తామన్నారు. ఈ ప్రాంతంలో కుంకుమ పువ్వు పంటను మరింత ప్రోత్సహిస్తామన్నారు. కాశ్మీర్‌లోని రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

త్వరలో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలను కాశ్మీర్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. కాశ్మీర్‌లోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

పాకిస్థాన్‌కు భారత్‌తో యుద్ధం చేసే దమ్ము లేదన్నారు. భారత్‌తో యుద్ధం చేసే దమ్ము లేకే, పాక్ ఉగ్రవాదుల ద్వారా కాశ్మీర్ ప్రచ్ఛన్న యుద్ధానికి దిగిందన్నారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భారత్‌ను ఢీ కొట్టలేకే పాకిస్థాన్ కవ్వింపుచర్యలకు దిగుతోందని ఆరోపించారు. కాశ్మీర్లో టెర్రరిజానికి పాకిస్థానే కారణమన్నారు. గతంలో కార్గిల్ యుద్ధసమయంలో కూడా తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు.

English summary
Prime Minister Narendra Modi arrived here on Tuesday(Aug.12) on his maiden visit to inaugurate two hydro-power projects in the Ladakh region and a 330 km Leh-Srinagar transmission line.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X