ప్రధాని నరేంద్ర మోడీకి ప్రాణహాని: అదే కారణం, మృత్యువు ఎదురు వస్తోంది, బ్రహ్మాండ గూరుజీ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రాణ గండం ఉందని కర్ణాటకకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు బ్రహ్మాండ గురూజీ నరేంద్రబాబు శర్మ అన్నారు. గురువారం హాసన్ లోని హాసానాంబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చెయ్యడానికి వచ్చిన బ్రహ్మాండ గురూజీ నరేంద్రబాబు శర్మ మీడియాతో మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రాణహాని నుంచి తప్పించుకోవాలంటే దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోం చేసి దేవుడిని ప్రార్థించాలని బ్రహ్మాండ గురూజీ నరేంద్రబాబు శర్మ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీకి వృశ్చిక రాశి దోషం వెంటాడుతోందని చెప్పారు.

PM Narendra Modis life is under threat says Brahmanda Guruji

ప్రధాని నరేంద్ర మోడీ ఇలాగే నిర్లక్షం చేస్తూ పోతే మృత్యువుకూడా వెంటాడుతోందని బ్రహ్మాండ గురూజీ నరేంద్రబాబు శర్మ అన్నారు. ఇదే సమయంలో కర్ణాటక రాజకీయాల గురించి మాట్లాడిన ఆయన వచ్చే శాసన సభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి కింగ్ మేకర్ అవుతారని జోస్యం చెప్పారు.

హెచ్ డీ. కుమారస్వామి మరో సారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని, అయితే ఆయన తండ్రి హెచ్ డీ. దేవేగౌడ (మాజీ ప్రధాని) మాట వినాలని, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని సలహా ఇచ్చారు. ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు.

సీఎం సిద్దరామయ్య సొంత ఆలోచనలు పక్కన పెట్టి చుట్టుపక్కల వారు చెప్పింది చేస్తూ చెడ్డపేరు తెచ్చుకునే అవకాశం ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు బ్రహాండ గురూజీ నరేంద్రబాబు శర్మ అన్నారు. కన్నడ బిగ్ బాస్ షోలో పాల్గొన్న బ్రహాండ గురూజీ నరేంద్ర బాబు శర్మ ఓ ప్రముఖ తెలుగు టీవీ చానల్ లో కూడా కొంత కాలం జ్యోతిష్యం చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
PM Narendra Modi's life is under threat, he need to do some special Pooja, Homa to get rid of it said Brahmanda Guruji Narendra Babu Sharma today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి