ప్రధాని పర్యటన: మంగళూరుకు ప్రత్యేక కారు, మోడీ భద్రతకు ఎన్ పీజీ అధికారులు, నిఘా !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 29వ తేదీన కర్ణాటకలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించడానికి ప్రత్యేకంగా కారు తెప్పించారు. శుక్రవారం ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానంలో మోడీ ప్రయాణించే కారు మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంది.

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా రెండు రోజుల ముందే ప్రత్యేక విమానంలో కారు తెప్పించారు. అక్టోబర్ 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. తరువాత అక్కడి నుంచి హెలికాప్టర్ లో ధర్మస్థలం చేరుకుంటారు.

PM Narendra Modis special car reached Mangaluru in Karnataka

ధర్మస్థలంలో శ్రీ మంజునాథ స్వామిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేసిన తరువాత అక్కడి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కారులో ఉజిర చేరుకుని శ్రీక్షేత్ర ధర్మస్థలం గ్రామీణాభివృద్ధి పనుల కోసం ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో పాల్గొంటారు. మోడీ పర్యటనలో భాగంగా ప్రత్యేక కారు తెప్పించారు.

PM Narendra Modis special car reached Mangaluru in Karnataka

మోడీ పర్యటనలో భాగంగా మంగళూరు, ధర్మస్థలంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళూరు, ధర్మస్థలం, ఉజిర ప్రాంతాల్లో మోడీ భద్రత పర్యవేక్షణను ఎన్ పీజీ అధికారులకు అప్పగించారు. ఇప్పటికే ఎన్ పీజీ బృందాలు ధర్మస్థలం చేరుకుని గట్టి నిఘా వేశారు. కర్ణాటకలోని పోలీసు అధికారులు ఎన్ పీజీ అధికారులకు సహాకరిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The special car has reached Mangaluru by Airforce special flight. This car will be using by Prime Minister Narendra Modi during his trip to Dharmasthala.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి