లేడీ ఐపీఎస్ అధికారితో పెట్టుకున్నాడు, మా నాన్న ఎవరో తెలుసా ?, నీ కారు ఎంత ?

మహిళా ఐపీఎస్ అధికారి వాహనాన్ని బైక్‌తో ఢీకొట్టడమే కాకుండా మహిళా పోలీసు అధికారిని దుర్భాషలాడి బెదిరించిన ఘటన బెంగళూరు సిటీలోని తుమకూరు ప్రధాన రహదారి గురగుంటేపాళ్యలో చోటుచేసుకుంది. గురుగుంటేపాళ్య జంక్షన్‌ సమీపంలో నిందితుడు కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారిణి శోభారాణికి చెందిన ప్రభుత్వ వాహనాన్ని అతివేగంతో వెనుక నుంచి ఢీకొట్టినట్లు సమాచారం.

పోలీసు అధికారిని శోభానాణి వెంటనే కారును రోడ్డుపక్కన ఆపి కారు డ్యామేజ్‌ని పరిశీలించాలని డ్రైవర్ కు సూచించారు. ఆ సమయంలో నిందితుడు మహిళా పోలీసు అధికారి శోభారాణి కారు డ్రైవర్‌పై అరవడం ప్రారంభించారు. వాహనంలో ఉన్న పోలీసు అధికారి శోభారాణి కూడా కారు కిందకు దిగి తన డ్రైవర్‌ను రక్షించారు. ఆ సమయంలో నిందితుడు మహిళా పోలీసు అధికారిని శోభారాణితో అసభ్య పదజాలంతో దూషించి ఆమెను బెదిరించాడు.

Police Arrests Youth For Rambling Lady IPS Officers Car, Abusing Her in Bengaluru

అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు, కానీ బైక్ రైడర్ ట్రాఫిక్ పోలీసులను కూడా దుర్భాషలాడాడని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం నిందితుడిని బైక్‌తో సహా ఆర్‌ఎంసీ యార్డ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఐపీఎస్ అధికారిణి శోభారాణి అతనిపై క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని అక్కడ ఉన్న పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

మహిళా పోలీసు అధికారి డాక్టర్ బీజే శోభారాణి ప్రస్తుతం బీబీఎంపీ ప్రధాన కార్యాలయంలో బెంగళూరు మెట్రోపాలిటన్ టాస్క్ ఫోర్స్‌లో ఎస్పీగా పనిచేస్తున్నారు. ఈ ఘటన ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య జరిగిందని పోలీసు అధికారులు అంటున్నారు. బెంగళూరులోని చిక్కబాణవారకి చెందిన సప్తగిరి లేఅవుట్‌కు చెందిన జి అభిషేక్ (22) అనే యువకుడిపై ఐపీఎస్ అధికారిని శోభారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మహిళా పోలీసు అధికారిని శోభారాణి ఆమె ఇంటి నుంచి ప్రభుత్వానికి చెందిన ఎస్‌యూవీ వాహనంలో ఆమె కార్యాలయానికి వెలుతున్న సమయంలో వెనుక నుంచి బైక్ లో వచ్చిన అభిషేక్ అనే యువకుడు ఆమె వాహనాన్ని ఢీకొట్టాడు. తన తండ్రి పలుకుబడి ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ అని, పలువురు ప్రముఖఉలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అభిషేక్ ఐపీఎస్ అధికారిని బెదిరించాడు.

తాను ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ కుమారుడు అని అభిషేక్ మహిళా ఐపీఎస్ అధికారిని బెదిరించి దుర్భాషలాడాడని కేసు నమోదు అయ్యింది.

నిందితుడు అభిషేక్ ను అరెస్టు చేసిన తర్వాత అతన్ని కోర్టు ముందు హాజరుపరిచారు, ఆ తర్వాత కోర్టు అభిషేక్ కు బెయిల్ మంజూరు చేసిందని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు అభిషేక్ పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+