Viral Video: రోడ్డుపై హద్దులు దాటి రొమాన్స్.. తాటతీసిన పోలీసులు..
ఈ మధ్య బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ కామన్ అయిపోయింది. ముఖ్యంగా రోడ్లపై వెళ్తూ రొమాన్స్ ఫ్యాషన్ గా మారిపోయింది. రోడ్డు బైక్ అమ్మాయితో వెళ్లడం.. అమ్మాయిని ట్యాంకర్ పై కూర్చుబెట్టుకోవడం.. అబ్బాయి బండి నడపడం.. అమ్మాయి అబ్బాయి కౌగిలించుకోవడం ఇదంతా కామన్ అయిపోయింది. తాజాగా ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పోలీసులు నిందితులను గుర్తించి జరిమానా విధించారు.
ఆదివారం ఢిల్లీలోని మంగోల్పురిలో ఔటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ పై ఓ జంట బైక్ పై వెళ్తూ రొమాన్స్ చేసింది. యువకుడు బైక్ నడుపుతుండగా.. అమ్మాయి అతడికి వ్యకతిరేక దిశలో పెట్రోల్ ట్యాంక్ పై కూర్చుంది. అబ్బాయిని గట్టి కౌగిలించుకుని ముద్దులు పెడుతోంది. వీరు బైక్ నిదానంగా వెళ్తుంటే.. వెనక నుంచి వస్తున్న వారు వారిని వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేరు చేశారు. ఈ వీడియో వైరల్ గా మారి పోలీసుల దృష్టికి వెళ్లింది.

ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. బైక్ నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. అజాగ్రత్తగా బండి నడిపిన వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారికి ఘాజియాబాద్ పోలీసులు రూ.11వేల ఫైన్ విధించారు. అయితే వీడియో పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని ఒకరు కామంట్ చేయగా.. మరొకరు రోడ్డును బెడ్ రూమ్ చేస్తున్నారంటూ మరొకరు కామెంట్ చేశారు.
Idiot's of Delhi
— 𝖀𝖗𝖇𝖆𝖓 𝖀𝖙𝖘𝖆𝖛 🗨️🦂 (@Buntea) July 16, 2023
Time - 7:15pm
Day - Sunday 16-July
Outer Ring Road flyover, Near Mangolpuri@dtptraffic pic.twitter.com/d0t6GKuZS5
అయితే ఇలాంటి ఘటన గతంలో కూడా చాలా జరిగాయి. గతంలో వైరల్ అయిన వీడియోలో ఇద్దరు అమ్మాయిలు బైక్ వెళ్తున్నారు. ఒక అమ్మాయి బైక్ పై సరిగా కూర్చుని బండి నడుపుతుంది. మరో అమ్మాయి బైక్ ట్యాంక్ పై కూర్చుంది. వారు బైక్ హ్యాండిల్ విడిచి పెట్టి ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. తర్వాత కౌగిలించుకున్నారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతకుముందు విశాఖపట్నంలో కూడా అబ్బాయి, అమ్మాయి బైక్ పై వెళ్తూ రొమాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.












Click it and Unblock the Notifications