టీటీవీ దినకరన్ కు సినిమా చూపిస్తున్న పోలీసులు, ఆర్ కే నగర్ లో నో చాన్స్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఇప్పటికే నామినేషన్ వేసిన అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు టీటీవీ దినకరన్ కు పోలీసులు సినిమా చూపిస్తున్నారు.

నామినేషన్ వేసి ఐదు రోజులు పూర్తి అయినా టీటీవీ దినకరన్ ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గంలో పర్యటించి తనకు ఓట్లు వెయ్యాలని ప్రచారం చెయ్యలేకపోతున్నారు. అందుకు కారణం తమిళనాడు ప్రభుత్వమే అంటూ టీటీవీ దినకరన్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

Police not given permission do campaign in RK Nagar for TTV Dinakaran

ఆర్ కే నగర్ లో ప్రచారం చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని ఐదు రోజుల క్రితం టీటీవీ దినకరన్ స్థానిక పోలీస్ స్టేషన్ లో అర్జీ సమర్పించారు. స్థానిక పోలీసులు అనుమతి ఇచ్చిన తరువాతే ఎవ్వరైనా ఆర్ కే నగర్ నియోజక వర్గం లో ప్రచారం చెయ్యడానికి అవకాశం ఉంటుంది.

Police not given permission do campaign in RK Nagar for TTV Dinakaran

టీటీవీ దినకరన్, ఆయన అనుచరులు స్థానిక పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. టీటీవీ దినకరన్ నియమనిబంధనలకు విరుద్దంగా అర్జీ సమర్పించారని ఆరోపిస్తూ పోలీసులు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. టీటీవీ దినకరన్ సమర్పించిన అర్జీని పోలీసు అధికారులు తిరస్కరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police has not given permission to do election campaign in R.K Nagar bypoll 2017 for TTV Dinakaran faction for 4 days.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X