Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దారుణం : ఎస్సైను కొట్టి చంపిన గ్యాంగ్‌స్టర్

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ పోలీసును గ్యాంగ్‌స్టర్ దారుణంగా హత్య చేశాడు. వివేక్ విహార్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఢిల్లీ పోలీస్ కమ్యూనికేషన్స్ ఎస్‌ఐగా పనిచేస్తున్న రాజ్ కుమార్ కొంతకాలంగా అక్రమ మద్యం, డ్రగ్స్ విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో కోపం పెంచుకున్న గ్యాంగ్‌స్టర్ విజయ్ అలియాస్ భరూరి, ఎస్‌ఐ రాజ్ కుమార్‌ను వెంబడించి దారుణంగా కొట్టి చంపాడు.

ఆదివారం రాత్రి భోజనం అనంతరం ఎస్ ఐ రాజ్‌కుమార్ వాకింగ్ చేస్తుండగా కొందరు వ్యక్తులు ఆయన వద్దకు వచ్చారు. అకారణంగా ఆయనతో వాదనకు దిగి గొడవ చేశారు. ఇంతలో ఆ దుండగులు ఎస్ఐపై విరుచుకుపడి దారుణంగా కొట్టడం ప్రారంభించారు. దీంతో తనను తాను రక్షించుకునేందుకు ఆయన దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయినా వెనక్కితగ్గని నిందితులు రాజ్ కుమార్‌ను దారుణంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయారు.

Police sub inspector beaten to death by gangsters in delhi

తీవ్రగ గాయాలపాలైన ఎస్ఐ రాజ్ కుమార్‌ను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దాదాపు పది మంది దుండగులు తన తండ్రిపై దాడి చేశారని చంపేశారని ఆయన కుమార్తె వైశాలి కన్నీరుమున్నీరయ్యారు. గతంలో పలుమార్లు గ్యాంగ్‌స్టర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

రాజ్ కుమార్ హత్యకు సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. వారిపై రెండు డజన్లకుపైగా కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+