• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Politics: సీఎం, దేవుడు మావాడే. అయితే పూజారి మాత్రం ?, విసిగిపోయి ఇలా చేశాము, బాంబు పేల్చిన రెబల్స్!

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ అసోం: మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితి తీసుకు వచ్చిన శివసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు సూరత్ నుంచి అసోం వెళ్లిపోయారు. ముంబాయిలో కుర్చుని లబోదిబో అంటున్న శివసేన పార్టీ నాయకులు రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం అవుతున్నాయి. ఇదే సమయంలో శివసేన రెబల్ నాయకులు వేసిన డైలాగ్ తో ఇంతకాలం శివసేనతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్, ఎన్సీపీ నాయకుల మతిపోయింది.

అసోంలో ఉన్న రెబల్ నాయకులు మాత్రం మాకు మా సొంత పార్టీ శివసేన నాయకులతో ఎలాంటి విభేదాలు లేవని, ఇంత జరగడానికి కారణం కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులే అని బాంబు పేల్చారు. దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదు అనే టైపులో సామెత చెప్పిన శివసేన రెబల్ నాయకుడు కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన మంత్రుల మీద మండిపడ్డారు. ఇలాంటి చెత్త మంత్రులు, నాయకులతో వేగలేక విసిగిపోయి సొంత పార్టీ మీద తిరుబాటు చేశాము అని అసలు మ్యాటర్ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలకు చెందిన నాయకులు షాక్ అయ్యారు.

Power: మీ గుడ్డిబిల్డప్ నాలుగు రోజులు మాత్రమే, మా రాజు వస్తాడు, మీకథ చూస్తాం, లేడీ లీడర్ దెబ్బతో సంజయ్ కి!Power: మీ గుడ్డిబిల్డప్ నాలుగు రోజులు మాత్రమే, మా రాజు వస్తాడు, మీకథ చూస్తాం, లేడీ లీడర్ దెబ్బతో సంజయ్ కి!

మేము మోనార్క్ లు.... ఎవరిమాట వినే పరిస్థితిలో లేము

మేము మోనార్క్ లు.... ఎవరిమాట వినే పరిస్థితిలో లేము

ముంబాయిలో కుర్చుని లబోదిబో అంటున్న శివసేన పార్టీ నాయకులు రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం అవుతున్నాయి. మేము మోనార్క్ లు ఎవరు ఎన్ని చెప్పినా వినే పరిస్థితిలో మేములేము, ఇంతకాలం మాకు జరిగిన అవమానం చాలు అని శివసేన పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు అంటున్నారు.

బాంబు పేల్చిన రెబల్ లీడర్

బాంబు పేల్చిన రెబల్ లీడర్

శివసేన రెబల్ నాయకులు చెప్పిన మాటలతో ఇంతకాలం మహారాష్ట్రలో శివసేనతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్, ఎన్సీపీ నాయకుల మతిపోయింది. అసోంలో ఉన్న రెబల్ నాయకులు మాత్రం మాకు మా సొంత పార్టీ శివసేన నాయకులతో ఎలాంటి విభేదాలు లేవని, ఇంత జరగడానికి కారణం కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులే అని బాంబు పేల్చారు.

సీఎం, దేవుడు మావాడే..... కాని పూజారి మావాడు కాదు

సీఎం, దేవుడు మావాడే..... కాని పూజారి మావాడు కాదు

ఓ ప్రముఖ టీవీ చానల్ తో శివసేన పార్టీకి చెందిన మంత్రి సందీపన్ భమర్ మాట్లాడారు. దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదు అనే టైపులో సామెత చెప్పిన శివసేన రెబల్ నాయకుడు సందీపన్ భమర్ సీఎం ఉద్దవ్ ఠాక్రే మా నాయకుడే అయినా కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన మంత్రులు మేము చెప్పిన ఏ పని చెయ్యడం లేదని, మా ఎమ్మెల్యేల (శివసేన) నియోజక వర్గాలకు నిధులు మంజూరు చెయ్యడం లేదని మండిపడ్డారు.

వేరేదారిలేక ఇలా చేశాము

వేరేదారిలేక ఇలా చేశాము

ఎంత చెప్పినా, ఎంత వేడుకున్నా కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలకు చెందిన మంత్రుు మా మాట వినలేదని, ఇలాంటి చెత్త మంత్రులు, నాయకులతో వేగలేక విసిగిపోయి సొంత పార్టీ మీద తిరుబాటు చేశాము అని శివసేనకు చెందిన రెబల్ మంత్రి సందీపన్ భమర్ ఆ మీడియా చానల్ కు అసలు మ్యాటర్ చెప్పడం కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు షాక్ అయ్యారు.

English summary
Politics: Maharashtra politics, We are upset with Congress and NCP style of functioning have no complaints against Shiv Sena party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X