షాకింగ్: పాపులర్ నటుడు ఆత్మహత్యాయత్నం.. లవ్ ఫెయిల్యూరే కారణం!

Subscribe to Oneindia Telugu

బనశంకరి: ఆత్మహత్యను కూడా పబ్లిసిటీ స్టంట్‌గా వాడుకున్నాడన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు కన్నడ నటుడు హుచ్చ వెంకట్. నెలరోజులుగా మీడియా ఫోకస్ లేకపోవడంతో న్యూనతా భావంలో కూరుకుపోయిన వెంకట్.. ఇందుకోసం ఆత్మహత్యయత్నానికి తెరలేపారని అంటున్నారు.

అయితే ప్రేమ విఫలం కావడం వల్లే హుచ్చ వెంకట్ ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలుస్తున్నప్పటికీ.. ఈ విషయాన్ని ఆయన ప్రచారం తీసుకున్న తీరు ఇదో పబ్లిసిటీ స్టంట్ అన్న అనుమానాలకు తావిచ్చింది. లవ్ ఫెయిల్యూర్ అయిందన్న బాధతో ఆదివారం నాడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు వెంకట్. ఆ వెంటనే అటు మీడియాకు, ఇటు సన్నిహితులకు సమాచారం అందించాడు.

 Popular Kannada Actor Huccha Venkat Attempts Suicide,Speaks to Media on Love Failure

స్నేహితులంతా కలిసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అక్కడ రచ్చ రచ్చ చేసినట్లు చెబుతున్నారు. డాక్టర్లపై విరుచుకుపడి పెద్ద సీనే క్రియేట్ చేశాడని చెబుతున్నారు. ఎప్పుడూ పబ్లిసిటీ కోసం పరితపించే వెంకట్.. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసి ఉంటాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కగా, కన్నడ సినిమాల్లో నటిస్తున్న ఓ నటితో హుచ్చు వెంకట్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. యువతి కూడా వెంకట్ ను ప్రేమిస్తున్నా.. వారి కుటుంబ సభ్యుల మాత్రం వెంకట్ తో పెళ్లిని నిరాకరిస్తూ వస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన వెంకట్ ఆదివారం నాడు ఫినాయిల్ తాగాడు. దీనికి తోడు ఇటీవల విడుదలైన హుచ్చ వెంకట్ 'పోకిరీ' చిత్రం కన్నడలో అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. దీంతో మీడియా అతన్ని పట్టించుకోవడం మానేసినట్లు తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a sudden shocking development popular Kannada Actor Huccha Venkat attempted Suicide today by consuming Phenyl.
Please Wait while comments are loading...