రేపు సాయంత్రం బీహార్ లో ఏం జరగబోతోంది ? లోకేష్ మంత్రాంగం ఫలిస్తుందా ?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కు సర్వం సిద్దమైంది. రేపు బీహార్ లోని 122 సీట్లకు రెండో దశ పోలింగ్ జరగబోతోంది. దీంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి. ఇప్పటికే రాష్ట్రంలో తొలి విడతలో 121 సీట్లకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఏకంగా 64 శాతం పైగా పోలింగ్ నమోదు కావడంతో అధికార ఎన్డీయే కూటమిలో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు రెండో దశలో ఏమాత్రం పరిస్దితి అనుకూలంగా లేకపోయినా ఇబ్బందులు తప్పవు. అలా కాకుండా ఎన్డీయేకే జనం మరోసారి ఓటేస్తే అసలు కథ మొదలుకాబోతోంది.

బీహార్ లో ఈసారి ఇండియా కూటమి (మహాకూటమి) తమ సీఎం అభ్యర్ధిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ను ప్రకటించింది. మరోవైపు అధికార ఎన్డీయే మాత్రం సీఎం అభ్యర్ధిని ప్రకటించలేకపోయింది. దీనికి ప్రధాన కారణం నితీశ్ కుమార్ ను మరోసారి సీఎంగా భరించేందుకు బీజేపీ ఏమాత్రం సిద్ధంగా లేకపోవడమే. అయితే ఆ విషయం నేరుగా చెప్పేసి బీజేపీ తరఫున సీఎం అభ్యర్దిని ప్రకటిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. దీంతో కేంద్రానికి నితీశ్ మద్దతు ఉపసంహరించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బీజేపీ మౌనంగా ఉంటూ తెరవెనుక లాబీయింగ్ చేస్తోంది.

Post-Bihar Poll Scenario The Question of Nitish Kumar and Lokesh s BJP Offer

ఇందులో భాగంగా అదే కేంద్రంలో మరో కీలక భాగస్వామి అయిన టీడీపీ అధినేత చంద్రబాబువైపు నుంచి నరుక్కుని వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే చివరి నిమిషంలో బీహార్ ఎన్నికల ప్రచారం పేరుతో చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఆయన బీహార్ కు వెళ్లి అక్కడ బహిరంగంగానే ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలతో పాటు రహస్యంగా సీఎం నితీశ్ నూ కలిసినట్లు సమాచారం. అయితే అధికారికంగా మాత్రం ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచారు.

Post-Bihar Poll Scenario The Question of Nitish Kumar and Lokesh s BJP Offer

బీజేపీ పెద్దల తరఫున నారా లోకేష్ బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో మంత్రాంగం జరిపినట్లు తెలుస్తోంది. ఈసారికి సీఎం పదవిని బీజేపీకి వదిలిపెట్టాలని, ఇందుకు ప్రతిగా కేంద్రంలో కీలక పదవి తీసుకోవాలని కోరినట్లు సమాచారం. దీనికి నితీష్ ఏమన్నారో తేలాలంటే రేపు సాయంత్రం రెండో దశ పోలింగ్ ముగిసేవరకూ ఆగాల్సిందే. రేపు బీహార్ లో రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్ లో అక్కడ ఎవరు అధికారంలోకి వస్తారో తేలిపోతుంది. మరోవైపు నితీశ్ పార్టీ జేడీయూకు గతంలో కంటే సీట్లు తగ్గుతాయన్న అంచనాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయినా ఆయన సీఎం పదవికి పట్టుబట్టకుండా కేంద్రంలో పదవి తీసుకునేందుకు అంగీకరిస్తారా లేదా అన్నది రేపు తేలబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+