హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Power Star: పవర్ స్టార్ కోసం ఒకే వేదిక మీద సూపర్ స్టార్, యంగ్ టైగర్ ఎన్డీఆర్, కర్ణాటక రత్న !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: గుండెపోటుతో ఒక్కసారిగా కోట్లాదిమంది అభిమానులకు దూరం అయిన స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు ఇస్తామని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కన్నడ రాజ్యోత్సవం నవంబర్ 1వ తేదీన పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వడానికి భారీ ఏర్పాట్లు చేశారు. కర్ణాటక రత్న అవార్డు పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు అందిస్తున్న సందర్బంగా చీఫ్ గెస్ట్ లుగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, యంగ్ టైగర్ ఎన్డీఆర్ ను కర్ణాటక ప్రభుత్వం. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు ఆహ్వానించారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మొదటి సినిమా అప్పుకు రజనీకాంత్ కు, పునీత్ రాజ్ కుమార్ తో యంగ్ టైగర్ ఎన్డీఆర్ కు ప్రత్యేక అనుభంధం, కొంచెం ప్లాష్ బ్యాక్ ఉంది.

Lovers: ప్రియుడి కేసులో ట్విస్ట్, పోలీస్ స్టేషన్ లో గిరిష్మా ఏంచేసిందంటే ?, సీక్రేట్ పెళ్లి !Lovers: ప్రియుడి కేసులో ట్విస్ట్, పోలీస్ స్టేషన్ లో గిరిష్మా ఏంచేసిందంటే ?, సీక్రేట్ పెళ్లి !

 అప్పు దూరమై అప్పుడే ఏడాది అయ్యింది

అప్పు దూరమై అప్పుడే ఏడాది అయ్యింది

గత ఏడాది అక్టోబర్ 29వ తేదీన స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోయారు. జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో పునీత్ రాజ్ కుమార్ ను వెంటనే బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై పునీత్ రాజ్ కుమార్ కోట్లాది మంది అభిమానులకు దూరం అయ్యారు.

 పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు

పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు

కోట్లాదిమంది అభిమానులకు దూరం అయిన స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు ఇస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ గత ఏడాది ప్రకటించారు. నబవంబర్ 1వ తేదీ కన్నడ రాజ్యోత్సవం సందర్బంగా పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వడానికి విదాన సౌధలో భారీ ఏర్పాట్లు చేశారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ చీఫ్ గెస్ట్

కర్ణాటక రత్న అవార్డు పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు అందిస్తున్న సందర్బంగా చీఫ్ గెస్ట్ లుగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, యంగ్ టైగర్ ఎన్డీఆర్ ను కర్ణాటక ప్రభుత్వం. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు ఆహ్వానించారు. మంగళవారం మద్యాహ్నం బెంగళూరులోని హెచ్ఏఎల్ కు ప్రత్యేక విమానంలో సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ చేరుకున్నారు.

 రజనీకాంత్ కు ఘనస్వాగతం

రజనీకాంత్ కు ఘనస్వాగతం

హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో కర్ణాటక మంత్రులు డాక్టర్ సుధాకర్, మునిరత్న తదితరులు సూపర్ స్టార్ రజనీకాంత్ కు పుష్పగుచ్చం. ఏ హిమాలయన్ మాస్టర్ అనే పుస్తకం అందించి ఘనస్వాగతం పలికారు. హెచ్ఏఎల్ ఏయిర్ పోర్టు నుంచి నేరుగా ఐటీసీ గార్డేనియా హోటల్ కు రజనీకాంత్, మంత్రులు డాక్టర్ సుధాకర్ మునిరత్న చేరుకుని అక్కడే భోజనం చేశారు.

యంగ్ టైగర్ ఎన్డీఆర్

పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు అందిస్తున్న సందర్బంగా యంగ్ టైగర్ నందమూరి తారక రామారావ్ (తారక్) కూడా బెంగళూరు చేరుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన సినిమాలో జూనియర్ ఎన్డీఆర్ పాట పాడిన విషయం తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ మొదటిసారి హీరో గా నటించిన అప్పు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

ఆ రోజు రజనీకాంత్ చీఫ్ గెస్ట్

అప్పు సినిమా 100 రోజుల వేడుక బెంగళూరులోని డాక్టర్ అంబేద్కర్ భవన్ లో జరిగిన సందర్బంలో చీఫ్ గెస్ట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరైనారు. పునీత్ రాజ్ కుమార్ మోదటి సినిమా 100 రోజుల వేడుకు హాజరైన రజనీకాంత్ అప్పును ఆశీర్వధించి ఆయనకు దగ్గర అయ్యారు. పునీత్ రాజ్ కుమార్ డ్యాన్స్, నటన గురించి రజనీకాంత్ ఇచ్చిన స్పీచ్ ఇప్పటికీ కన్నడిగులు గుర్తు చేసుకుంటున్నారు.

English summary
Power Star: Super Star Rajinikanth and Jr NTR In Bengaluru for Puneeth Rajkumar Karnataka Ratna Award Ceremony,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X