జమ్ముకశ్మీర్ ఫొటోగ్రాఫర్లకు ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు, రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లా అభినందనలు.
ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ అవార్డులను బోర్డు ప్రకటించింది. 2020 ఏడాదికి భారత్ మూడు అవార్డులను దక్కించుకున్నది. జమ్ముకశ్మీర్ విభజన సందర్భంగా అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపిన ముగ్గురు ఫోటోగ్రాఫర్లకు అవార్డు వరించింది. ఆ ముగ్గురు ఫోటోగ్రాఫర్లకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తదితరులు ప్రశంసలతో ముంచెత్తారు.
రోజాతో సహా ఐదుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు: కరోనా వ్యాప్తికి వారే కారణం: కిం కర్తవ్యం..!

జమ్ముకశ్మీర్ విభజన..
2019 ఆగస్ట్ 5వ తేదీన భారతవనిలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని నరేంద్ర మోడీ సర్కార్ రద్దు చేసింది. జమ్ముకశ్మీర్, లడాఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. సున్నితమైన కశ్మీర్లో పరిస్థితి చేయిదాటుతుందోనని.. 40 వేలకు పైగా సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించి.. పరిస్థితిని సమీక్షించారు. అయితే కశ్మీర్లో వాతావారణాన్ని అసోసియేటెడ్ ప్రెస్‌కి చెందిన ఫొటోగ్రాఫర్లు ముక్తార్ ఖాన్, యాసిన్ దార్, చన్నీ ఆనంద్ ప్రపంచానికి చూపారు. తమ ఫోటోలతో కశ్మీర్లో పరిస్థితిని చూపించారు.

ముగ్గురికి అవార్డు..
ఆ ముగ్గురికి పులిట్జర్ అవార్డులను కమిటీ ప్రకటించింది. కరోనా వైరస్ వల్ల కమిటీ సభ్యులు 18 మంది బిజీగా ఉండటం వల్ల అవార్డుల ప్రకటన రెండు వారాలు ఆలస్యమైంది. గతంలో మాదిరిగా న్యూయార్క్‌లోని కొలంబియా వర్సిటీలో కార్యక్రమంలో కాకుండా.. యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా పులిట్జర్ బోర్డు అడ్మినిస్ట్రేటర్ డానా కెనెడీ అవార్డులను ప్రకటించారు. భారత్‌కు చెందిన ముగ్గురు ఫోటోగ్రాఫర్లకు ప్రతిష్టాత్మకమైన అవార్డులు వచ్చాయి.

బ్రేకింగ్ న్యూస్ క్యాటగిరీ..
హంకాంగ్‌లో నిరసనలకు సంబంధించి రాయిటర్స్ తీసిన ఫోటోలు బ్రేకింగ్ న్యూస్ క్యాటగిరీలో అవార్డు దక్కించుున్నది. ఉష్ణోగ్రతల ప్రభావంపై వాషింగ్టన్ పోస్ట్ చేసిన రిపోర్టింగ్‌ను వివరణాత్మక ప్రైజ్ వరించింది. ద న్యూయార్క్ టైమ్స్‌కు ఎక్కువ అవార్డులు వచ్చాయి. అంతర్జాతీయ విభాగంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పాలనపై అందించిన స్టోరీలకు మూడు అవార్డులను గెలుచుకుంది.
అభినందనలు
భారత ఫోటోగ్రాఫర్లను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభినందించారు. మీరు చేసిన అద్భతమైన పనితీరుతో ప్రతిష్టాత్మక అవార్డు రావడం తమకు గర్వంగా ఉంది అని ఆయన ట్వీట్ చేశారు. గత 30 ఏళ్ల మాదిరిగా గతేడాది పరిస్థితులు లేవు అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అవార్డు గెలుచుకున్న జర్నలిస్టులను అభినందించారు. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ముఫ్తీ మొహమ్మద్ కూతురు ఇల్తిజా ముఫ్తీ కూడా ఫొటోగ్రాఫర్లను అభినందించారు.