Prabhas: బాహుబలి బిస్కేట్ రూ. 10 వేలు, స్కెచ్ అదిరింది, విదేశాల్లో షూటింగ్, చివరికి చాట మిగిలింది!
ముంబాయి/ హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ కు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ఎవ్వరూ ఊహించనంత స్థాయికి ఎదిగిపోయాడు. బాహుబాలి సినిమా దెబ్బతో ప్రభాస్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తమిళ, కన్నడ, మళయాలం, హిందీ చిత్రపరిశ్రమలో మంచి క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ప్రభాస్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ సినిమాలో మీకు చాన్స్ ఇప్పిస్తామని అనేక మందికి కొందరు మస్కా కొట్టారు. అమాయకులకు బాహుబలి బిస్కేట్ వేసిన కిలాడీలు ఒక్కొక్కరి నుంచి రూ. 10,000 పైగా వసూలు చేసి ఆకాశంలో చుక్కలు చూపించి నేలనాకించేయడంతో వాళ్లకు ఇప్పుడు చాట మిగిలింది.

డార్లింగ్ ప్రభాస్ క్రేజ్
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలు ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు ఎవ్వరూ చెప్పలేనంత, చాలా మంది అంచనా వెయ్యలేనంత స్థాయికి ఎదిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అంటూ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

బాహుబలి బిస్కేట్ రూ. 10 వేలు
హీరో ప్రభాస్ పేరు చెప్పిన ముంబాయిలోని ఓ ప్రొడక్షన్ సంస్థ డబ్బు చేసుకుంది. తాము హీరో ప్రభాస్ తో ఓ సినిమా నిర్మిస్తున్నామని, ప్రస్తుతం విదేశాల్లో సినిమా షూటింగ్ జరుగుతోందని, కొత్తనటీనటులకు ఆ సినిమాలో చాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నామని, వాళ్లను సినిమా షూటింగ్ కోసం విదేశాలకు పిలుచుకుని వెలుతామని, ఆసక్తి ఉన్న నటీనటులు రూ. 10, 000 చెల్లించి పేర్లు రిజిస్టర్ చేయించుకోవాలని ఆ ప్రోడక్షన్ సంస్థ ప్రకటనలు ఇచ్చింది.

బెల్లం ఉంటే ఈగలకు కరువా !
బెల్లం ఉన్న చోట ఈగలు ఉంటాయనే సామెతలాగా ప్రభాస్ నటించే సినిమాలో మేము నటిస్తే మంచి పేరుతో పాటు సినిమా అవకాశాలు చిక్కుతాయని కొందరు సినిమా పిచ్చోళ్లు ఎగరేసుకుంటూ వెళ్లి ఆశపడ్డారు. అంతే ప్రొడక్షన్ సంస్థ సూచించినట్లు ఒక్కొక్కరు రూ. 10, 000 వేలు చెల్లించి సినిమా చాన్స్ వస్తుందని ఎదురు చూశారు.

ఆకాశం చూపించి భూమి నాకించేశారు
రూ. 10 వేలు చెల్లించినా చాలా కాలం అయినా సినిమా చాన్స్ రాకపోవడంతో, విదేశాల్లో సినిమా షూటింగ్ కోసం పిలవకపోవడంతో ఓ యువతికి అనుమానం వచ్చి మొదట ముంబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు చేసిన తరువాత చాలా మంది తాము ఇలాగే మోసపోయాం అంటూ ముంబాయి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడానికి క్యూకట్టారు. హీరో ప్రభాస్ పేరుతో అమాయకులు, సినిమా పిచ్చోళ్లకు కుచ్చుటోపి పెట్టిన ఆ ప్రోడక్షన్ సంస్థ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

సినిమా చాన్స్ ల పేరుతో పడక సుఖాలు
సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తామని యువతీ యువకులను అమాయకులను మోసం చెయ్యడం సినిమా ఇండస్ట్రీలో కొందరికి మాత్రం కొత్త ఏమీ కాదు. సినిమాలో చాన్స్ ఇప్పిస్తామని అమ్మాయిలతో పడక సుఖం పొందిన తరువాత వారిని వేశ్యవాటికకు తరలించి అరెస్టు అయ్యారు. అయితే బాహుబలి ప్రభాస్ పేరుతో అమాయకులకు క్రీమ్ బిస్కేట్ వేసిన నిందితుల భరతం పట్టడానికి ముంబాయి పోలీసులు సిద్దం అయ్యారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications