ఇలా ఉన్నారేంట్రా: ఫామ్ హౌస్‌లో పార్టీ కార్యకర్తతో స్వలింగ సంపర్కం: ఎమ్మెల్సీ అరెస్ట్

Suraj Revanna: లైంగిక వేధింపుల కేసులో పీకల్లోతు కూరుకుపోయింది జనతాదళ్ (సెక్యులర్). కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామి సోదరుడు, మాజీ మంత్రి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టు వ్యవహారంతో ఇప్పటికే పతనావస్థకు చేరిన జేడీఎస్‌పై తాజాగా మరో ఆటం బాంబు పడింది.

రేవణ్ణ రెండో కుమారుడు సూరజ్ రేవణ్ణ కూడా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు. సూరజ్.. జేడీఎస్ ఎమ్మెల్సీ కూడా. జేడీఎస్ కార్యకర్తతో స్వలింగ సంపర్కానికి పాల్పడిన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. శనివారమే ఆయనపై కేసు నమోదైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు హసన్ పోలీసులు సూరజ్‌పై ఐపీసీలోని సెక్షన్ 322 కింద కేసు పెట్టారు. ఈ ఉదయం ఆయనను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం బెంగళూరుకు తరలించారు.

Prajwal Revanna s brother Suraj Revanna arrest by Hassan Police

హసన్ జిల్లాలోని హోళె నరసీపురా సమీపంలో గల గణ్ణికడ్డె వద్ద రేవణ్న కుటుంబానికి ఓ ఫామ్ హౌస్‌ ఉంది. ఈ ఫామ్ హౌస్‌లో పార్టీ కార్యకర్తపై లైంగిక వేధింపులకు దిగాడు సూరజ్. పార్టీలో కీలక పదవులు ఇస్తానంటూ ఆశపెట్టి ఈ నెల 16వ తేదీన అతనిపై స్వలింగ సంపర్కానికి పాల్పడ్డాడు.

ఈ నెల 16వ తేదీన తన ఫామ్ హౌస్‌కు రావాలంటూ ఆ కార్యకర్తకు సూరజ్ పంపించిన మెసేజ్‌ను రికార్డు చేశారు. ఫామ్ హౌస్ వద్ద ఉన్న పోలీసులకు ఆ మెసేజ్ చూపించి లోనికి వెళ్లానని, ఆ వెంటనే సూరజ్ తనను బెడ్రూమ్‌కు తీసుకెళ్లి అసహజ సెక్స్‌ చేసినట్లు బాధితుడు ఫిర్యాదుపత్రంలో పొందుపరిచాడు.

తాకరాని చోట తాకాడని, పెదవులు కొరికాడని, బలవంతంగా బట్టలు విప్పదీసి లైంగికంగా వేధించినట్లు బాధితుడు వివరించాడు. పిలిచినప్పుడల్లా ఫామ్ హౌస్‌కు రావాలని, తనతో డేటింగ్‌లో ఉంటే- రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్తానని సూరజ్ హామీ ఇచ్చినట్లు తెలిపాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణపాయం ఉంటుందని కూడా బెదిరించినట్లు చెప్పాడు.

లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే సూరజ్ అన్న, లోక్ సభ మాజీ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్న అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను సిట్ అదుపులో ఉన్నాడు. విచారణను ఎదుర్కొంటోన్నాడు. మొన్నటి ఎన్నికల్లో హాసన్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు ప్రజ్వల్. ఈ కేసులో ఆయన తండ్రి రేవణ్ణ కూడా అరెస్ట్ అయ్యారు. బెయిల్‌పై విడుదల అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+