ఎంపీ సెక్స్ స్కాండల్ కేసులో ట్విస్ట్, బీజేపీ లీడర్, ఫేమస్ లాయర్ ఎస్కేప్, లేడీ దెబ్బతో జంప్ !
హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్యకర వీడియోల పెన్ డ్రైవ్‌ను షేర్ చేశారనే ఆరోపణలు రావడంతో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత బీజేపీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది దేవరాజ్ గౌడ కనిపించకుండా పోయారని సమాచారం.
దేశవ్యాప్తంగా గత రెండువారాలుగా తీవ్ర చర్చకు దారితీసిన హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు మరో మలుపుతిరిగింది.
అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ప్రజ్వల్ రేవణ్ణపై ఇప్పటికే నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనప్పటికీ ఆయన ఎవరికీ చిక్కకుండా విదేశాల్లోనే ఉంటున్నాడు. అయితే ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్ షేర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ న్యాయవాది, బీజేపీ నాయకుడు దేవరాజ్ గౌడ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను ఎవ్వరికి పెన్ డ్రైవ్ షేర్ చేయలేదని, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

ఇదే సమయంలో న్యాయవాది దేవరాజేగౌడపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన మీద కేసు నమోదు అయిన తరువాత ఆయన కూడా అదృశ్యమయ్యారు.
హాసన్ పెన్ డ్రైవ్ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. అశ్లీల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్‌లు అందరికి పంచిపెట్టారని, ఆ వీడియోలు షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
పెన్ డ్రైవ్ లు పంపిణి చేసిన విషయంలో తన పాత్ర లేదని బీజేపీ నేత, న్యాయవాది దేవరాజ్‌గౌడ అన్నారు. అలాగే క్లయింట్ కార్తీక్ నాకు పెన్ డ్రైవ్ ఇచ్చాడు. అసభ్యకరమైన వీడియోలను షేర్ చేసినందుకు తెచ్చిన స్టే ఆర్డర్‌ను ఎత్తివేయమని కోర్టును అభ్యర్థించాడు. దీంతో దేవరాజేగౌడ తన కక్షిదారు ఇచ్చిన సాక్ష్యాలను బహిరంగంగా అందరికి చూపించి న్యాయవాద వృత్తి నిబంధనలను గాలికి వదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
న్యాయవాది దేవరాజ్ గౌడపై బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల ఫిర్యాదు రావడంతో ఆయన మీద కేసు నమోదు అయ్యింది. బీజేపీ నేత, న్యాయవాది దేవరాజే గౌడ ఇప్పటికే పెన్ డ్రైవ్ బ్లాక్ మెయిలర్‌గా అని పేరు తెచ్చుకున్నారు. హాసన్ జిల్లా హోలెనరసిపూర్‌లో ఓ మహిళ న్యాయవాది దేవరాజే గౌడపై ఫిర్యాదు చేసిందని వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో అనవసరంగా పెన్ డ్రైవ్ కేసును తెరపైకి తెచ్చి ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ నేతలపైనా ఆరోపణలు చేస్తున్నారు.
ఓ మహిళను బలవంతంగా లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వెంటనే న్యాయవాది దేవరాజ్ గౌడపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అతన్ని అరెస్టు చేసి అతని నిజస్వరూపాన్నిరాష్ట్ర ప్రజలకు వెల్లడించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దేవరాజ్ గౌడపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బెంగళూరు పశ్చిమ జిల్లా కాంగ్రెస్ ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అయిన తర్వాత న్యాయవాది దేవరాజే గౌడ ఎవరికీ కనపడకుండా అదృశ్యమయ్యాడు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications