వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెడికల్ కాలేజీ స్కాంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పాత్ర ఉంది: ప్రశాంత్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లక్నో మెడికల్ కాలేజీ స్కాంలో భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పాత్ర ఉందని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరగాలని అన్నారు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇప్పటికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌పై నలుగురు సీనియర్ జడ్జిలు తిరుగుబాటు జెండా ఎగురవేసిన సంగతి తెలిసిందే. మరోవైపు జస్టిస్ చలమేశ్వర్ చేసిన ఆరోపణలకు కూడా ప్రశాంత్ భూషణ్ మద్దతు పలికారు. తాజాగా ప్రశాంత్ భూషణ్ చేసిన ఆరోపణలతో మరింత వేడి రాజుకుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!