షాకయ్యా?: 'ఆనంది' మృతిపై ట్విట్టర్‌లో ఎవరేమన్నారు
ముంబై: బుల్లితెర నటి, 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌లో నటించిన ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు, నటులు, బుల్లితెర నటులు దిగ్బ్రాంతి వక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ ఆకాంక్షించారు. ప్రత్యూష ఆత్మహత్య ఘటన పలువురు బాలీవుడ్ ప్రముఖులను కలిచివేసేలా చేసింది.
ప్రత్యూష మరణంపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పేపర్‌లో ప్రత్యూష ఆత్మహత్య వార్త చూసి షాక్‌కు గురయ్యామని ట్వీట్ చేసింది. ఎంత అవమానం, అంత మంచి అమ్మాయి అర్థాంతరంగా జీవితాన్ని ముగించడం బాధ కలిగించిందని బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషి కపూర్ అన్నారు.
ఆమెలో చెలరేగిన బడబాగ్ని ఎవరికి తెలుసంటూ ప్రత్యూష మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. బాలికా వధు సీరియల్ ఒక్కటే తాను చూస్తానని సిమీ గరేవాల్ అన్నారు. 24 ఏళ్లకే ఆమె తనువుచాలించడం విచాకరమన్నారు. కుటుంబ మద్దతు లేకుండా ఆడపిల్లల మనుగడ చాలా కష్టమవుతుందని ఆమె ట్విట్ చేశారు.
మానసిక ఒత్తిడిపై సీరియస్‌గా స్పందించని కుటుంబాలకు, స్నేహితులకు ఇది ఒక హెచ్చరిక లాంటిదని కరణ్ జోహార్ ట్విట్ చేశారు. ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ ఆమె హఠాన్మరణం తనను షాక్‌కు గురి చేసిందంటూ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు.
కుష్బు, నీతూ చంద్రా, అనుపమ్ ఖేర్, రిచా చద్దా, టీవీ నటీనటులు సోఫీ చౌదరి, కరిష్మా తన్నా, మికా సింగ్, గౌర్ ఖాన్ ప్రత్యూష మృతిపట్ల సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఈ విషాదాన్ని తట్టుకోలిగే శక్తిని ఆమె తల్లిదండ్రులకు ప్రసాదించాలని వేడుకున్నారు. ముంబైలోని తన నివాసంలో ప్రత్యూష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
What a shame! Such a lovely person should suicide! Who knows the turmoil within her. RIP. pic.twitter.com/tIDk1QetF1
— Rishi Kapoor (@chintskap) 1 April 2016
#pratushabanerjee The only serial I've watched was Balika. For her! Very sad. Only 24. It's too tough here for girls without family support.
— Simi Garewal (@Simi_Garewal) 2 April 2016
This is just so sad...and a wake up calm to families and friends who don't consider depression a medical condition...RIP #PratyushaBanerjee
— Karan Johar (@karanjohar) 1 April 2016
A girl died...let her loved ones mourn in peace...social media may not have a conscience....but can it have a heart?
— Karan Johar (@karanjohar) 1 April 2016
Opened the papers to Pratyushas suicide😢So young!Heartbreaking. They say "Sometimes even to live is an act of courage". #RIPPratyusha
— SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) 2 April 2016












Click it and Unblock the Notifications