షాకింగ్.. మరిది ప్రైవేట్ పార్ట్ కోసేసిన వదిన.. కారణం ఇదే..!
మరిది ప్రేవేట్ పార్ట్ ను కోసేసింది ఓ మహిళ. అతడు నిద్రిస్తున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో జరిగింది.
ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఉమేష్ అనే యువకుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఉమేష్.. తన తల్లిదండ్రులతోపాటు అన్న రాజ్, వదిన మంజూలతో కలిసి ఉంటున్నాడు. మంజూ చెల్లితో ఉమేష్ ప్రేమ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. అయితే వీరి పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. దీంతో మంజూ చెల్లి డిప్రెషన్ లోకి వెళ్లింది. దీపావళికి ఇంటికి వచ్చిన ఉమేష్ తో ఇదే విషయంపై మంజూ.. ఉమేష్ ను అడగ్గా నిరాకరించాడు.
भाभी ने सोते हुए देवर का प्राइवेट पार्ट काटा.. जांच मे मिली चौकाने वाली वजह
— TRUE STORY (@TrueStoryUP) October 20, 2025
UP के प्रयागराज मे 20 वर्ष के युवक उमेश का सोते हुए प्राइवेट पार्ट काट दिया गया। पुलिस ने उमेश की भाभी मंजू को अरेस्ट किया है। मंजू ने हमला करके उमेश का प्राइवेट पार्ट काटकर अलग कर दिया था। युवक की हालत… pic.twitter.com/A8rn1EwiVN
అంతేకాక ఉమేష్.. మరో అమ్మాయిని వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. మరోవైపు మంజూ చెల్లి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఇదే విషయంపై కోపం పెంచుకున్న మంజూ.. ఉమేష్ నిద్రిస్తున్న సమయంలో అతడి రూమ్ లోకి వెళ్లి ప్రైవేట్ పార్ట్ ను కట్ చేసింది. వెంటనే ఉమేష్ అరుపులు కేకలు పెట్టాడు. దీంతో మంజూ అక్కడినుంచి పారిపోయింది. ఉమేష్ కేకలు విన్న అతని సోదరుడు రూమ్ లోకి పరుగెత్తికుని వచ్చాడు. రక్తపుమడుగులో అతడు పడి ఉన్నాడు. అతడి ప్రైవేట్ పార్ట్ తెగి పడి ఉంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంజూను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఇక ఉమేష్ కు గంటన్నరపాటు సర్జరీ చేశామని.. అతడు పూర్తిగా కోలుకునేందుకు 8 నుంచి 9 నెలలు పడుతుందని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లోనూ ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లి విషయంలో గొడవ జరిగి.. బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ ను కోసేసింది ఓ యువతి.












Click it and Unblock the Notifications