చావనైనా చస్తా కానీ: కేజ్రీవాల్, రాసలీలల మంత్రి పోర్న్ హబ్ ఉద్యోగి!
న్యూఢిల్లీ: నేను చావనైనా చస్తాను కానీ పార్టీ విలువలను మాత్రం పణంగా పెట్టలేనని, తాను ఎట్టి పరిస్థితుల్లోను రాజీ పడే ప్రసక్తి లేదని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం నాడు అన్నారు.
రాసలీలల ఢిల్లీ మంత్రికి ఒకరికి కేజ్రీవాల్ ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఓ వీడియో సందేశం పంపించారు. తాను చావనైనా చస్తాను కానీ విలువలు పణంగా పెట్టేనని చెప్పారు. ఇది తనతో పాటు సీనియర్ నేతలందరికీ వర్తిస్తుందన్నరు.
సందీప్ కుమార్ పార్టీని మోసం చేశారన్నారు. అతను ఏఏపీ విలువలను పణంగా పెట్టారన్నారు. దేశం యావత్తు ఏఏపీ విలువలను మెచ్చుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి విలువల విషయంలో తాము రాజీపడే ప్రసక్తి లేదన్నారు.

ఇదిలా ఉండగా, సెక్స్ స్కాండల్‌లో చిక్కుకుని మంత్రి పదవి కోల్పోయిన సందీప్ కుమార్ తమ ఉద్యోగేనని పోర్న్ హబ్ అరియా అనే పోర్న్ వెబ్‌సైట్ తెలిపినట్లుగా డిఎన్‌ఏ వార్తా కథనం ప్రచురించింది. తమ కథనంలో పోర్న్‌హబ్ అరియా ట్విటర్ అకౌంట్ ద్వారా చేసిన ట్విటర్‌ను కూడా పొందుపరిచింది.
సందీప్ కుమార్‌తో సహా తమ ఉద్యోగులందరినీ తాము ప్రేమిస్తామని పోర్న్ హబ్ అరియా వెల్లడించింది. పోర్న్ హబ్ అరియా తన ట్వీట్‌ను మంత్రి ట్విటర్ అకౌంట్‌కు ట్యాగ్ కూడా చేసినట్లు డిఎన్‌ఏ వెల్లడించింది. ఇద్దరు మహిళలతో రాసలీలలు చేస్తూ దొరికిపోయిన సీడీ లభించడంతో మంత్రి సందీప్‌ను కేబినెట్ నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేటేశారు. అయితే సీడీలో ఉన్నది తాను కాదని మంత్రి సందీప్ వాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications