రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయని సచిన్, రేఖ: ఎందుకో తెలుసా?

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌రుగుతున్న వేళ ఇప్పుడు దేశమంతా ఆ అంశంపైనే చర్చించుకుంటోంది. పార్ల‌మెంట్‌తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. లోక్‌స‌భ, రాజ్య‌స‌భ‌లోని ఎంపీలు పార్లమెంట్‌లో ఓటేస్తున్నారు.

ఓటు హక్కు లేదు

ఓటు హక్కు లేదు

కానీ, రాజ్య‌స‌భ సభ్యులే అయిన మాజీ క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండూల్క‌ర్‌, బాలీవుడ్ న‌టి రేఖ‌, బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి, బాక్స‌ర్ మేరీకోమ్‌లు మాత్రం ఓటు వేయ‌డం లేదు. ఎందుకంటే వీరికి ఓటు వేసే హక్కు లేదు. ఎందుకంటే.. వీళ్లంతా రాష్ట్ర‌ప‌తి నామినేటెడ్ ఎంపీలు.

ఆ 14మందికీ అంతే..

ఆ 14మందికీ అంతే..

రాష్ట్ర‌ప‌తే వీళ్ల‌ను నామినేట్ చేశారు కాబట్టి ఆ ప‌ద‌వికి జ‌రిగే ఎన్నిక‌లో ఓటు వేయ‌డానికి వీళ్లు అర్హులు కాదు. వీళ్లే కాదు.. వీరితోపాటు రాజ్య‌స‌భ‌లో మొత్తం 12 మందిని, లోక్‌స‌భ‌లో ఇద్ద‌రు ఆంగ్లో ఇండియ‌న్స్‌ను రాష్ట్ర‌ప‌తి నామినేట్ చేస్తారు. దీంతో ఈ 14 మందికి ఓటు వేసే హ‌క్కు ఉండ‌దు.

రాజ్యసభలో ఉన్నా..

రాజ్యసభలో ఉన్నా..

ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌లో ఈ న‌లుగురితోపాటు న‌టుడు సురేశ్ గోపి, రూపా గంగూలీ, న‌రేంద్ర జాద‌వ్‌, స్వ‌ప‌న్ దాస్‌గుప్తా, కేటీఎస్ తుల‌సి, ప‌రాశ‌ర‌ణ్‌, అను ఆగా, శంభాజీ రాజేల‌ను రాష్ట్ర‌ప‌తి రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేశారు. వీరంతా పార్లమెంటులో సభ్యులుగా ఉన్నప్పటికీ ఓటు మాత్రం వేయలేరన్న మాట.

Sachin Tendulkar Enjoys 'Best Breakfast' by His Son Arjun Tendulkar
కోవింద్ ఎన్నిక లాంఛనమే

కోవింద్ ఎన్నిక లాంఛనమే

రాష్ట్రపతి బరిలో ఎన్డీఏ అభ్యర్థిగా బీహార్ మాజీ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ ఉండగా, కాంగ్రెస్, విపక్షాల అభ్యర్థిగా మీరాకుమార్ బరిలో నిలిచారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఎక్కువగా ఉండటంతో రామ్ నాథ్ కోవింద్ ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nominated members are not allowed to cast their votes. So, cricket legend Sachin Tendulkar and actress Rekha will not be casting their votes this time.
Please Wait while comments are loading...