Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గ్యాస్ సిలిండర్లపై కేంద్రం భారీ ఊరట

Commercial LPG Cylinder Price: వంటగ్యాస్ వినియోగదారులకు స్వల్పంగా లభించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్‌పై 41 రూపాయల మేర తగ్గింది. ఈ ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. వాటి రేట్లను తగ్గించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరిలో రూ. 14.50 పైసలు, ఫిబ్రవరిలో ఏడు రూపాయల మేర వాణిజ్య అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు తగ్గాయి.

Prices of commercial LPG gas cylinders reduced by Rs 41 with effect from today

కిందటి నెల అంటే మార్చి 1వ తేదీన ఈ సిలిండర్ల రేట్లను ఆరు రూపాయల మేర పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఇప్పుడు మరోసారి ఒక్కో సిలిండర్ ధర 41 రూపాయల మేర తగ్గుముఖం పట్టింది. తాజా తగ్గింపుతో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు రూ.1,762 రూపాయలకు తగ్గింది.

ముంబైలో రూ. 1,755.50 పైసల నుంచి రూ. 1,714.50 పైసలకు తగ్గింది. కోల్‌కతలో 1,913 రూపాయల నుంచి 1,872 రూపాయల మేర తగ్గింది. చెన్నైలో నిన్నటివరకు రూ. 1,965.50 పైసలు ఉన్న కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధర.. ప్రస్తుతం నుంచి రూ. 1,924.50 పైసలు పలుకుతోంది.

గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర 803 రూపాయలు. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పంపిణీ చేసే గృహావసర వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో సబ్సిడీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో గ్యాస్ కనెక్షన్‌పై 200 రూపాయల సబ్సిడీని ఇచ్చింది.

గత డిసెంబర్ 1వ తేదీ వరకూ కూడా కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు వరుసగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకూ ప్రతినెలా ఒకటో తేదీన వీటి రేట్లు పెరుగుతూ వచ్చాయి. వాటని సవరిస్తూ ఉత్తర్వులను జారీ చేస్తూ వచ్చాయి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.

ఆ అయిదు నెలల వ్యవధిలో అదనంగా రూ. 172.50 పైసలను అదనంగా చెల్లించాల్సి వచ్చింది వినియోగదారులకు. ఆగస్టులో ఒక్కో సిలిండర్ మీద రూ.8.50 పైసలు, సెప్టెంబర్ 1వ తేదీన 39 రూపాయలు, అక్టోబర్‌లో 48.50 పైసలు, నవంబర్‌లో ఏకంగా 62 రూపాయల మేర భారాన్ని వినియోగదారుల మీద మోపాయి. డిసెంబర్‌లో రూ.16.50 పైసల చొప్పున పెంచాయి.

అయిదుసార్లు పెరిగిన తరువాత జనవరి నుంచి తగ్గుముఖం పట్టాయి. ఒక్కో సిలిండర్‌పై జనవరి 1వ తేదీన రూ. 14.50 పైసల మేర తగ్గించాయి ఆయిల్ కంపెనీలు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+