ఈ ఏడాది చిట్టచివరిసారిగా నరేంద్ర మోడీ ఆ స్పీచ్: ఏబీసీ ఛార్ట్: విశాఖవాసి పేరు ప్రస్తావన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది ఇదే ఆయన చిట్టచివరి ప్రసంగం. విశాఖపట్నానికి చెందిన వెంకట మురళి గురించి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆయన రూపొందించిన ఏబీసీ ఛార్ట్ గురించి వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ ఛార్ట్ (ఏబీసీ)లో అనేక విషయాలను వెంకట మురళి పొందుపరిచినట్లు నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
ఆత్మనిర్భర్ భారత్, లోకల్ ఫర్ వోకల్, స్టార్టప్‌ల రంగం గురించిన అనేక విషయాలను వెంకట్.. తన ఏబీసీ ఛార్ట్‌లో వివరించారని మోడీ తెలిపారు. ప్రతి దేశ పౌరుడు కూడా ఆత్మనిర్భర్ భారత్ సహా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోన్న వస్తువులకు ప్రత్యామ్నాయంగా రూపొందించాల్సిన అంశాలపై ఓ ఛార్ట్‌ను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోడీ అన్నారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి ఛార్ట్ చేస్తారని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

విదేశీ వస్తువల దిగుమతిని నియంత్రించడంతో పాటు దేశీయంగా అలాంటి వాటికి ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. సిక్కుల మత గురువు గురు గోవింద్ సింగ్, ఆయన కుమారుడు సాహెబ్‌జాదె త్యాగాల గురించి మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. తాను కొద్దిరోజుల కిందటే దేశ రాజధానిలోని గురుద్వారాను సందర్శించానని గుర్తు చేశారు. సిక్కుల త్యాగనిరతి అత్యంత గొప్పదని పేర్కొన్నారు. దేశంలో చిరుతల సంఖ్య భారీగా పెరిగిందని నరేంద్ర మోడీ చెప్పారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్










Click it and Unblock the Notifications