Priyanka Gandhi: భారీ ఆధిక్యంలో ప్రియాంక గాంధీ..

సోనియా గాంధీ తనయురాలు, రాహుల్ గాంధీ సోదరి, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక్ గాంధీ వయనాడ్‌ దూసుకెళ్తోన్నారు. 60 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఆమె ఉన్నారు. ఆమె ఆధిక్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ వెనుకంజలో ఉన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్ బరేలి, వయనాడ్ నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించారు. దీంతో ఆయన వయనాడ్ లో రాజీనామా చేశారు. అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ప్రయాంక గాంధీ పోటీ చేశారు.

ఇక్కడ ప్రియాంక గాంధీ గెలుస్తోందని అందరికి తెలిసిన విషయమే. కేరళలో బీజేపీకి బలం లేకపోవడం.. అక్కడున్న వారంతా సెక్యూలర్ భావజాలంతో ఉండడంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిగింది. కానీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. మరోసారి అధికారం కైవసం చేసుకునే దిశ వెళ్తోంది.మహారాష్ట్రలో బీజేపీ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటిసింది. దాదాపు 195 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి77 చోట్ల ముందంజలో ఉంది.

Priyanka Gandhi continues to have a huge lead in Wayanad

అటు జార్ఖండ్ లో హోరాహరీ పోరు కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ కూటమి 39 స్థానాల్లో బీజేపీ కూటమి 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ ఫలితాలు భిన్నంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు ఫలితాలు వస్తుండగా.. జార్ఖండ్ లో మాత్రం ఫలితాలు భిన్నంగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+