వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ దారిలో: అమేథీలో ప్రియాంక కొడుకు రెహాన్

|
Google Oneindia TeluguNews

అమేథీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు 14ఏళ్ల రెహన్ వాద్రా తన మేనమామ, అమేథీ ఎంపీ రాహుల్‌గాంధీ అడుగుజాడలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఆయన తన స్నేహితులతో కలిసి ఆకస్మికంగా ఓ గ్రామాన్ని సందర్శించారు.

గ్రామీణులతో పిచ్చాపాటీ మాట్లాడిన రెహన్ ఆ తరువాత వారితో కలిసి భోజనం కూడా చేశారు. రెహన్ గౌరీగంజ్ ప్రాంతంలోని కౌహర్ గ్రామానికి మంగళవారం వచ్చాడని, ఆ రాత్రి తమ గ్రామంలోనే ఉన్నాడని స్థానిక కాంగ్రెస్ వర్గాలు, ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

Priyanka Gandhi Vadra's Son Rehan Pays a Surprise Visit to Amethi

సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక మాదిరిగానే గ్రామీణులతో కలిసి పోయాడని, వారి జీవన విధానం గురించి తెలుసుకున్నాడని తెలిపారు. రెహన్ వెంట రాజీవ్ గాంధీ మహిళా వికాస్ ప్రాజెక్టుకు చెందిన నీలేశ్‌జైన్, కేఎస్ యాదవ్ ఉన్నారు.

రామ్‌కృపాల్ పాండే ఇంట్లో బస చేసిన రెహన్ బృందం దాల్ చావల్, సబ్జీ రోటీ (అన్నం, పప్పు, రొట్టే, కూర) తిన్నారని, తరువాత గ్రామంలో పర్యటించారని చెప్పారు. కట్టె మంచాలపైనే కూర్చుని తిన్నారని, రాత్రి దోమ తెరలు కట్టుకొని వాటిపైనే నిద్రపోయారని తెలిపారు.

English summary
Rehan, the son of Priyanka Gandhi and Robert Vadra, on Tuesday paid a surprise visit to his family stronghold Amethi where he stayed overnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X