ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం-సీటు ఖరారు-రాహుల్ తిరిగి అక్కడే..!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇండియా కూటమి పేరుతో విపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఫ్రంట్ పలు రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాట్లు చేసుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తున్న వీరిద్దరూ.. ఇప్పుడు తాము పోటీ చేయాల్సిన సీట్లపైనా దృష్టిసారించారు. ఇందులో ముందుగా ఈసారి ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్న ప్రియాంక గాంధీని గతంలో ఆమె తల్లి పలుమార్లు గెలిచిన రాయ్ బరేలీ సీటు నుంచి బరిలోకి దించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఐదుసార్లు గెలిచిన రాయ్ బరేలీ లోక్ సభ సీటులో ఈసారి ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం చేయబోతున్నారు. ఇప్పటికే సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో లోక్ సభ ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు. దీంతో ఆమెను రాజ్యసభ నుంచి రాజ్యసభకు పంపారు. అప్పుడే ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని తేలిపోయిది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్దం చేస్తున్న అభ్యర్ధుల జాబితాలో ప్రియాంక పేరు కూడా రాయ్ బరేలీ నుంచి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు గత లోక్ సభ ఎన్నికల్లో అమేథీ సీటు నుంచి నాలుగోసారి పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి అదే సీటులో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు. గతంలో అమేథీలో పోటీ చేసి మూడుసార్లు ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీకి గత ఎన్నికల్లో మాత్రం బీజేపీ నేత స్మతీ ఇరానీ చేతిలో భంగపాటు తప్పలేదు. అయితే దీన్ని ముందుగానే ఊహించారో ఏమో కేరళలోని వాయనాడ్ సీటులోనూ పోటీ చేసిన రాహుల్ గాంధీ అక్కడ మాత్రం భారీ మెజార్టీతో గెలిచారు.
తిరిగి ఇప్పుడు అమేథీలో పోటీకి రాహుల్ సిద్దమవుతున్నారు.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
తల నరికి ఇంటికి పట్టుకెళ్లాడు.. !! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications