పోలింగ్ వేళ తీవ్ర ఉద్రిక్తత- డిప్యూటీ సీఎం కారుపై చెప్పులు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్‌కు ఆరంభమైంది. మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఓటు వేయడానికి తెల్లవారు జాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు.
మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. రెండు విడతలుగా జరిగే ఈ ఎన్నికల్లో పురుషులు- 3.92, మహిళలు- 3.5 కోట్ల మంది ఓటు వేయనున్నారు.
సజావుగా సాగుతున్న పోలింగ్ ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఉప ముఖ్యమంత్రి, లఖిసరాయ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్‌పై దాడి జరిగింది. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మద్దతుదారులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఖోరియారి గ్రామంలో ఈ దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఆర్జేడీ మద్దతుదారులు ఉపముఖ్యమంత్రిని చుట్టుముట్టారు. ఆయన కారుపై చెప్పులు విసిరారు. ముర్దాబాద్.. అంటూ నినదించారు. ఆయన ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.

ఈ దాడి పట్ల విజయ్ కుమార్ సిన్హా తీవ్రంగా స్పందించారు. దాడి చేసిన వారిని ఆర్జేడీ గూండాలుగా అభివర్ణించారు. ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. గ్రామాన్ని సందర్శించకుండా తనను అడ్డుకున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ పోలింగ్ ఏజెంట్‌ను కూడా వారు వెనక్కి పంపారని, బూత్ నంబర్లు 404, 405 వద్ద ఓటు వేయకుండా అడ్డుకున్నారని సిన్హా ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో తాను తప్పకుండా గెలుస్తానని విజయ్ కుమార్ సిన్హా ధీమా వ్యక్తం చేశారు. దాడి చేసిన వారికి తీవ్ర హెచ్చరిక చేశారు. అధికారంలోకి ఎన్డీఏ వస్తోందని, వీరి గుండెలపై బుల్డోజర్ నడుస్తుందని హెచ్చరించారు. ఆర్జేడీ గూండాలు తనను ఖొరియారి గ్రామాన్ని సందర్శించడానికి అడ్డుకుంటోన్నారని ఆరోపించారు. ఖోరియారి లోని 404, 405 పోలింగ్ కేంద్రాల్లో బూత్ క్యాప్చరింగ్ జరుగుతోందని మండిపడ్డారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications