Waves OTT: అందుబాటులోకి వేవ్స్ ఓటీటీ.. ఉచితంగా వీడియో స్ట్రీమింగ్..!
ప్రస్తుతం దేశంలో ఓటీటీల యుగం నడుస్తోంది. దేశంలో ఇప్పటికే చాలా ఓటీటీలు ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీ లివ్, హాట్ స్టార్, జియో సినిమా, సన్ నెక్ట్స్, ఆహాతో పాటు చాలా ఓటీటీలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రైవేట్ కంపెనీల ఓటీటీలు. తాజాగా ప్రభుత్వ రంగా బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్ తన OTT (ఓవర్-ది-టాప్) ప్లాట్‌ఫారమ్ 'వేవ్స్'ని తీసుకొచ్చింది. వేవ్స్ ప్లాట్‌ఫారమ్ లో క్లాసిక్ కంటెంట్, సమకాలీన ప్రోగ్రామింగ్‌లు ఉంటాయని ప్రకటించింది. ఓటీటీ తీసుకొచ్చి ఆధునిక డిజిటల్ ట్రెండ్‌లను స్వీకరించినట్ల పేర్కొంది.
వేవ్స్ ఓటీటీలో రామాయణం, మహాభారతం, శక్తిమాన్, హమ్ లాగ్ వంటి కార్యక్రమాలు ఉన్నట్లు ప్రకటించింది. తమ ఓటీటీ ప్రేక్షకులను ఆకర్షిస్తుందని ఆశభావం వ్యక్తం చేసింది. వేవ్స్ ఓటీటీలో వార్తలు, డాక్యుమెంటరీలు, ప్రాంతీయ కంటెంట్‌ను కూడా అందిస్తుంది. వేవ్స్ ఓటీటీలో 12 భాషలలో అందుబాటులో ఉంది. హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, మరాఠీ, కన్నడ, మలయాళం, తెలుగు, తమిళం, గుజరాతీ, పంజాబీ, అస్సామీ బాషల కంటెంట్ ను అందిస్తోంది.

ఇది వీడియో ఆన్ డిమాండ్, ఫ్రీ-టు-ప్లే గేమింగ్, రేడియో స్ట్రీమింగ్, లైవ్ టీవీ స్ట్రీమింగ్, 65 లైవ్ ఛానెల్‌లు, వీడియో, గేమింగ్ కంటెంట్ కోసం యాప్ ఇంటిగ్రేషన్‌లలో అనేక యాప్‌లు, ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) కూడా ఈ ఓటీటీలో అందుబాటులో ఉంది. వేవ్స్‌లో అయోధ్య నుంతి ప్రభు శ్రీరామ్ లల్లా ఆర్తి లైవ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నెలవారీ మన్ కీ బాత్ వంటి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. రాబోయే US ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లైవ్ లో అందిస్తున్నారు.
देश के नागरिकों को साफ़ सुथरा पारिवारिक मनोरंजन तथा देश दुनिया की अद्यतन जानकारियाँ खबरी चैनलों के माध्यम से देने , बच्चों को गेम्स, आसान ऑनलाइन शॉपिंग के साथ खेलों को लाइव देखने की सुविधा के साथ भारत का अपना OTT प्रसार भारती ने आज launch किया है @PMOIndia @prasarbharati… pic.twitter.com/p5AeMEOBgq
— Navneet Sehgal (@navneetsehgal3) November 20, 2024
వేవ్స్ ఓటీటీలో పలు సినిమాలు కూడా అందిస్తున్నారు. ఫాంటసీ యాక్షన్ సూపర్ హీరో 'మంకీ కింగ్ ది హీరో ఈజ్ బ్యాక్,' జాతీయ అవార్డు గెలుచుకున్న ఫౌజా, అర్మాన్, విపుల్ షా థ్రిల్లర్ షో భేద్ భారం, పంకజ్ కపూర్ నటించిన ఫ్యామిలీ డ్రామా థోడే డోర్ థోడే పాస్, కైలాష్ ఖేర్ మ్యూజిక్ రియాలిటీ వంటి ఇతర చలనచిత్రాలు ఉన్నాయి.కాగా వేవ్స్ ఓటీటీ ఉచిత సర్వీస్ అందిస్తోంది. దీనికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సి అవసరం లేదు. ఫోన్ ప్లే స్టోర్ కు వెళ్లి వేవ్స్ ఓటీటీ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications