లేడీ న్యూడ్ ఫోటో అశ్లీలం కాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మహిళల నగ్న చిత్రాల ప్రచురణ విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం సంచలనమైన తీర్పును వెలువరించింది. ఒక మహిళ నగ్న చిత్రాన్ని ప్రచురణకు వినియోగిస్తే అది అశ్లీలం కిందకు రాదని స్పష్టం చేసింది. మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించడాన్ని నిషేధించే 1986 చట్టం కింద కోర్టు ఈ తీర్పు చెప్పింది.
ఒక మహిళ నగ్న చిత్రం లేదా అర్థనగ్న చిత్రం లైంగిక ఉద్వేగాన్ని, కోర్కెలను కలుగజేస్తే తప్ప దానిని అశ్లీలమని అనడానికి లేదని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ ఏకే సిక్రిలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.

ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ బోరిస్ బెకర్ నగ్న చిత్రాన్ని ప్రచురించిన రెండు ప్రచురణ సంస్థలపై విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఏదైనా కథనం లేదా పుస్తకం అసభ్యకరంగా ఉందని నిర్ధారించే విషయంలో కోర్టు కొందరి అబిప్రాయాలను కాకుండా జాతి ప్రమాణాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని సూచించింది.
అసభ్యకరమనేది చిత్ర భంగిమలపై ఆధారపడి ఉంటుందని, కామవాంఛని కలిగించే వాటినే అశ్లీలంగా భావించాల్సి ఉంటుదని ధర్మాసనం తెలిపింది. అశ్లీలమనేది అనేది సాధారణ పౌరుడు ఆలోచనల్లోంచి చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications