Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video Viral:కరోనా యుద్ధాన్ని గెలిచిన తన సోదరికి తీన్మార్ స్టెప్పులతో గ్రాండ్ వెల్కమ్

పూణే: కరోనావైరస్ ఇటు దేశాన్ని అటు ప్రపంచాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని ఒక యుద్ధంలా భావిస్తోంది దేశం. ఈ యుద్ధంలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కరోనావైరస్ కట్టడి చేసేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఇక కరోనావైరస్ బారిన పడి ఆపై ఆ మహమ్మారిపై విజయం సాధించి వస్తున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. హాస్పిటల్‌లో చికిత్స తీసుకుని నెగిటివ్ వచ్చాక డిశ్చార్జ్ కూడా అవుతున్నారు. కోవిడ్-19 బారిన పడి కోలుకుని తిరిగి ఇంటికి చేరుకుంటున్న తమ వారిని చూసి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా పూణేలో ఓ యువతి కోవిడ్ బారిన పడి కోలుకుని తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే ఆమెకు తమ కుటుంబ సభ్యులు పలికిన ఘనస్వాగతం చూసి నివ్వెరపోయింది. ప్రస్తుతం నెట్టింట్లో ఆ వీడియో వైరల్‌గా మారింది.

Recommended Video

    #Watch COVID Asymptomatic Patients Flash Mob| Pune Girl Grand Welcome to Sister- Videos Viral

    కరోనా వైరస్ పై విజయం సాధించిన యువతి

    ప్రస్తుతం కరోనాపై విజయం సాధించడమంటే నిజంగానే ఒక యుద్ధంలో విజయం సాధించినంత ఆనందంగా ఫీల్ అవుతున్నారు కరోనాబారిన పడి కోలుకున్న పేషెంట్లు. ప్రస్తుతం దేశాన్ని కరోనా కుదిపేస్తున్న క్రమంలో చాలా మంది ఆ మహమ్మారిని జయించి తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. ఆ సమయంలో వారికి ఘనస్వాగతం లభిస్తోంది. తాజాగా పూణేకు చెందిన ఓ యువతి కరోనావైరస్ నుంచి కోలుకుని ఇంటికి చేరుకుంది. అంతే ఆమెకు తమ కుటుంబ సభ్యులు పలికిన ఘనస్వాగతం చూసి షాక్ అయ్యింది. అంతేకాదు ఆమె కూడా డ్యాన్స్ వేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

     తీన్మార్ స్టెప్పులతో వెల్కమ్ చెప్పిన యువతి సోదరి

    తీన్మార్ స్టెప్పులతో వెల్కమ్ చెప్పిన యువతి సోదరి

    పూణేలో నివాసముంటున్న ఒక యువతి కరోనావైరస్ నుంచి కోలుకుని తిరిగి ఇంటికి చేరుకోగానే తన సోదరి ఆమెకు స్టెప్పులతో గ్రాండ్ వెల్కమ్ పలికింది. బాలీవుడ్ సినిమా చిల్లర్ పార్టీ నుంచి తాయ్ తాయ్ ఫిష్ పాటకు స్టెప్పులేస్తూ కరోనా బారినపడి ఆ మహమ్మారిపై విజయం సాధించిన తన సోదరికి ఘనస్వాగతం పలికింది. ఇక్కడ డ్యాన్స్ చేసి ఘనస్వాగతం పలికిన యువతి పేరు సలోని సత్పుతే. పూణేలో నివాసం ఉంటున్న సలోని కుటుంబం మొత్తం కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారించబడగా ఈమె ఒక్కదానికి నెగిటివ్‌గా తేలింది.

    కుటుంబంలో అందరికీ...

    ముందుగా సలోని తండ్రికి కరోనావైరస్ పాజిటివ్ సోకి హాస్పిటల్‌లో అడ్మిట్ కాగా... ఆ తర్వాత ఆ ఇంట్లో మరో నలుగురు కుటుంబ సభ్యులకు కోవిడ్-19 వ్యాపించింది. ఇక సలోని ఒక్కదానికే కరోనావైరస్ నెగిటివ్‌గా తేలింది. తన తల్లిదండ్రులు కొద్దిరోజుల తర్వాత హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ కాగా, సలోని సోదరి చివరిగా డిశ్చార్జ్ అయ్యింది. ఇక ఒక్కసారిగా తన సోదరి కనిపించగానే తీన్మార్ స్టెప్పులతో ఇరగదీస్తూ గ్రాండ్ వెల్కమ్ పలికింది. తన సోదరి కూడా ఈ సంబరాన్ని పంచుకుంది. ఇక తమ కుటుంబానికి కరోనా వచ్చిందని తెలిసిన పొరిగింటి వారు సలోనీతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. అలాంటి వారికి కూడా ఇదొక కనువిప్పు కావాలన్న ఉద్దేశంతో ఆమె మరింత రెచ్చిపోయి తీన్మార్ స్టెప్పులతో దంచికొట్టింది. ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగానే నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ రాశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+