మహిళా ఎమ్మెల్యేను అందరూ చూస్తుండగానే కొట్టిన భర్త: వీడియో వైరల్
ఛండీగఢ్: పంజాబ్‌లోని తల్వాండి సబోకు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రొఫెసర్ బల్జిందర్ కౌర్‌ను ఆమె భర్త బహిరంగంగా కొట్టాడు. దీంతో ఆయనపై గృహహింస కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. జూలై 10లో ఎమ్మెల్యే భర్త సుఖ్‌రాజ్ బాల్, స్వయంగా ఆప్ స్థానిక నాయకుడు.. కుటుంబ సభ్యుల సమక్షంలో గృహ వివాదం సమయంలో బల్జిందర్ కౌర్‌ను చెంపదెబ్బ కొట్టడం కనిపించింది.

అయితే ఈ విషయమై ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. బల్జీందర్ కౌర్, ఆమె భర్త సుఖ్‌రాజ్ బాల్ ఈ అంశంపై వ్యాఖ్యానించలేదు.
ఈ వీడియో వైరల్ కావడంతో, గృహ హింస కేసులో ఎమ్మెల్యే భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Husband 'slaps' AAP MLA Baljinder Kaur, video viral pic.twitter.com/0uOWv9YExy
— puneet (@puneetpareenja) September 2, 2022
నివేదికల ప్రకారం, పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ సంఘటనపై సుమోటో నోటీసు తీసుకోవాలని యోచిస్తోంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటూ నినాదాలు చేసే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు.. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications