PVR INOX Multiplex:దేశవ్యాప్తంగా పీవీఆర్ సినిమాస్ మూసివేత, ఎందుకంటే..?
PVR INOX: సినీ అభిమానులకు ఇదొక బ్యాడ్ న్యూస్. దేశవ్యాప్తంగా ఉన్న పలు పీవీఆర్ ఐనాక్స్ సినిమా థియేటర్లను మూసివేసేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కొత్తగా కొన్ని స్క్రీన్స్ ప్రారంభించినప్పటికీ చాలా చోట్ల థియేటర్లను శాశ్వతంగా మూసివేసేందుకే మెుగ్గు చూపింది. ఈ విషయాన్ని త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఇచ్చిన రిపోర్టులో వెల్లడించింది. ఇందుకు పలు కారణాలను సైతం రిపోర్టులో పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లు నష్టాల్లో పయనిస్తున్నందున రానున్న ఆరు నెలల్లో చాలా థియేటర్లను మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు రిపోర్టులో వెల్లడించింది.ఇందులో భాగంగా ఓ 50 థియేటర్లను శాశ్వతంగా మూసివేయనున్నట్లు తెలిపింది. షాపింగ్ మాల్స్‌లో ఉన్న ఈ స్క్రీన్స్ అన్ని నష్టాల ఊమిలో కూరుకుపోయాయని ఇవి తిరిగి లాభాలు ఆర్జిస్తాయన్న ఆశకూడా ఆవిరైపోయిందని యాజమాన్యం పేర్కొంది.

ఇదిలా ఉంటే పీవీఆర్ ఐనాక్స్ గత ఆర్థిక సంవత్సరంలో 30 సినిమా థియేటర్లలో 168 కొత్త స్క్రీన్స్‌ను ప్రారంభించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 150-175 కొత్త స్క్రీన్స్‌ను ప్రారంభించాలని భావిస్తోంది.ప్రస్తుతం భారత్ శ్రీలంక దేశాల్లో కలిపి 115 నగరాల్లో 361 సినిమా హాల్స్‌లో 1689 స్క్రీన్స్ ఉన్నాయి. అంతకుముందు కేవలం పీవీఆర్‌గానే ఉన్న ఈ సంస్థ... ఆ తర్వాత ఐనాక్స్‌తో కలిపి పీవీఆర్ ఐనాక్స్‌గా గుర్తింపు పొందింది.
పీవీఆర్ ఐనాక్స్‌లు కలిసి పోవడం వల్ల మల్టీప్లెక్స్ ఇండస్ట్రీలో ఒక విప్లవం సృష్టించాయని మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజిలి చెప్పారు. ఈ మధ్యే పీవీఆర్ ఐనాక్స్‌లు కలిసిపోవడంతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక మైలు రాయిగా నిలుస్తుందని చెప్పారు. రెండు కలవడంతో రానున్న రెండేళ్లలో రూ.225 కోట్లు మేరా లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications