భారత్‌కు దౌత్య విజయం: మరణశిక్ష విధించిన 8మంది మాజీ అధికారులను విడుదల చేసిన ఖతార్!!
దౌత్య పరంగా భారత్ మరో విజయాన్ని సాధించింది. గూడచర్య నేరంపై ఖతార్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారులకు విధించిన మరణశిక్షను రద్దు చేసేలా భారత్ చేసిన ప్రయత్నం ఫలించింది. ఖతార్ ప్రభుత్వం ఎనిమిది మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు ఎట్టకేలకు స్వేచ్ఛను ప్రసాదించి, విడుదల చేసింది. ఇక ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఎనిమిది మందిలో ఏడుగురు ఇప్పటికే భారత్ కు తిరిగి వచ్చేశారని వెల్లడించింది. భారతదేశానికి చెందిన ఎనిమిది మంది మాజీ మెరైన్ లు గర్ల్స్ లో ఆల్ దహ్రా అనే కంపెనీలో పనిచేశారు. అయితే వీరిని 2022 ఆగస్టులో అక్కడి పోలీసులు గూఢచర్య ఆరోపణలపై అరెస్టు చేశారు.

పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కెప్టెన్ నవ తేజ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ వశిష్ట, కమాండర్ అమిత్ నాగపాల్, కమాండర్ పూర్ణేందు తివారి, కమాండర్ సంజీవ గుప్తా, కమాండర్ నాగ సుగుణాకర్ పాకాల ఉన్నారు. వీరందరికీ గతేడాది అక్టోబర్లో అక్కడి కోర్టు మరణదండన విధించింది. భారత్ కు ఈ విషయాన్ని తెలియజేయకుండానే ఖతార్ కోర్టు నిర్ణయం తీసుకుంది.
అయితే మరణశిక్ష విధించబడిన భారత మాజీ ఉద్యోగుల కోసం రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం కోర్టులో అప్పీలు దాఖలు చేసింది. అనంతర పరిణామాలలో న్యాయస్థానం నేవీ మాజీ అధికారులకు విధించిన మరణ శిక్షను జైలు శిక్షగా గతేడాది డిసెంబరు 29వ తేదీన తగ్గిస్తూ తీర్పునిచ్చింది.
అంతేకాదు దీన్ని కూడా అప్పీలు చేసుకునేందుకు 60 రోజులకు గడువిచ్చింది. దీంతో నేవీ మాజీ ఉద్యోగులను కాపాడేందుకు అన్ని న్యాయ మార్గాలను వినియోగించుకున్న భారత్ ఈ ప్రయత్నంలో సఫలీకృతమైంది. ఇక తాజాగా దీనిపై జరిగిన విచారణ నేపథ్యంలో ఎనిమిది మంది అధికారుల మరణశిక్షను ఖతార్ రద్దు చేసి వారిని విడుదల చేసింది. దౌత్య పరంగా భారతదేశం చేసిన తీవ్ర ప్రయత్నాలు ఎనిమిది మంది భారతీయుల ప్రాణాలను కాపాడాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications