Radhakishan Damani: డిఫెన్స్ స్టాక్ లాభాల దూకుడు.. రాధాకిషన్ దమానీ పెట్టుబడులు.. మీరూ కొన్నారా..?
Radhakishan Damani Portfolio: రాకేష్ జున్ జున్ వాలా మరణంతో ఇప్పుడు చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఆయన గురువైన రాధాకిషన్ దమానీ పోర్ట్ ఫోలియోను ఫాలో అవుతున్నారు. అనేక మంది ఆయన పెట్టుబడులు పెట్టిన కంపెనీలను ప్రస్తుతం ట్రాక్ చేస్తున్నారు. డీమార్ట్ అధినేత ఇన్వెస్ట్ చేసిన డిఫైన్స్ స్టాక్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందిస్తోంది.

డిఫెన్స్ మల్టీబ్యాగర్ స్టాక్..
స్టాక్ మార్కెట్ వెటరన్ రాధాకిషన్ దమానీ పోర్ట్‌ఫోలియోలోని డిఫెన్స్ కంపెనీ షేర్లు ప్రస్తుతం మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తోంది. పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సంపదను డబుల్ చేసింది. అవును ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది ఆస్ట్రా మైక్రోవేవ్ షేర్ గురించే. మోదీ ప్రభుత్వం డిఫైన్ రంగంలో పెట్టుబడులు, స్వదేశీ కంపెనీల ప్రోత్సహించటం వంటి చర్యల వల్ల ఈ రంగంలోని ఇతర కంపెనీలు సైతం మంచి లాభాలను తమ ఇన్వెస్టర్లకు అందిస్తున్నాయి.

షేర్ ధర చరిత్ర..
ఆస్ట్రా మైక్రోవేవ్ గత ఏడాది కాలంలో పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేసింది. ఏడాది కాలంలో షేర్ ధర రూ.153.55 నుంచి రూ.332.50కి పెరిగింది. బీఎస్‌ఈ గురువారం ట్రేడింగ్ సెషన్‌లో స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయి అయిన రూ.336.50 మార్కును తాకింది. చివరికి నిన్న షేర్ రూ.332.50 ధర దగ్గర ముగిసింది. భారతీయ స్టాక్ మార్కెట్లలో క్షీణత ఉన్నప్పటికీ, ఈ మల్టీబ్యాగర్ డిఫెన్స్ స్టాక్ గత 6 నెలల్లో పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇచ్చింది. 5 రోజుల్లో 15 శాతానికి పైగా పెరిగింది.

స్టాక్ లో దమానీ పెట్టుబడులు..
బిలియనీర్ ఇన్వెస్టర్ రాధాకృష్ణ దమానీ జూన్ 2022 నాటికి ఆస్ట్రా మైక్రోవేవ్‌లో 1.03 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఆగస్టు 25, 2022 నాటికి దీని నికర విలువ రూ.1,78,662.7 కోట్ల కంటే ఎక్కువ. 'ఆత్మనిర్భర్ భారత్' కింద.. ప్రభుత్వం నోటిఫై చేసిన మూడవ జాబితాలో 101 ఆయుధాలు/వ్యవస్థలు/ప్లాట్‌ఫారమ్‌లు/పరికరాలు ఉన్నాయి. 1991లో ఏర్పాటైన ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (AMPL), ప్రత్యేకంగా హై-ఎండ్ RF (రేడియో ఫ్రీక్వెన్సీ) మరియు మైక్రోవేవ్ సబ్‌సిస్టమ్స్, స్ట్రాటజిక్ అప్లికేషన్‌ల కోసం సిస్టమ్‌లను డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి చేస్తోంది.












Click it and Unblock the Notifications