జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ రాజీనామా, గవర్నర్‌కు లేఖ అందజేత, ఆపద్దర్మ సీఎంగా కొనసాగింపు
జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ ముఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడిపోవడంతో రాజ్‌భవన్ వచ్చి గవర్నర్ ద్రౌపది ముర్ముకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. రాజీనామా ఆమోదించిన గవర్నర్.. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్దర్మ సీఎంగా కొనసాగాలని కోరారని చెప్పారు.

47 సీట్లతో..
జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి 47 సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దాటింది. రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 41 సీట్ల మార్కు దాటిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలుంటుంది. కాంగ్రెస్ కూటమి 47 సీట్లు సాధించి, అధికార బీజేపీని విపక్షానికి నెట్టేసింది. బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. జేవీఎంపీ 3, ఏజేఎస్‌యూ 2, ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు.

సీఎం ఓటమి..
జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ జంషెడ్‌పూర్ తూర్పు నుంచి పోటీచేసి ఓడిపోయారు. తన మాజీ క్యాబినెట్ సహచరుడు, సరయూ రాయ్ చేతిలో మట్టి కరిచారు. రాష్ట్రంలో పార్టీ ఓడిపోవడం సహజం కానీ.. సీఎం, పీఎంలు ఓటమి పాలవ్వడం అరుదు. జంషెడ్‌పూర్ తూర్పు నియోజకవర్గం ఆయనకు పెట్టిన కోట. గత 24 ఏళ్ల నుంచి ఆయనకు ఓటమి అంటే ఏంటో తెలియదు. కానీ ఈసారి, తన ప్రత్యర్థి, మాజీ సీఎం సరయూ రాయ్ చేతిలో ఓడిపోయారు.

24 ఏళ్ల నుంచి
1995 నుంచి జంషెడ్‌పూర్ తూర్పు నుంచి రఘుబర్ దాస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడినుంచి ఐదుసార్లు రఘువర్ దాస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తూర్పు జంషెడ్‌పూర్ నియోజకవర్గం దాస్‌కు పెట్టిన కోట.. కానీ ఈసారి మాత్రం ఫలితాలు తారుమారయ్యాయి. మొదటి రౌండ్ నుంచి సరయూ రాయ్ ఆధిక్యంలో దూసుకెళ్లారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications