తల్లి,చెల్లి వెంటరాగ ఆమేథిలో రాహుల్ గాంధి నామినేషన్
Recommended Video

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి తన మొదటి పార్లమెంట్ నియోజకవర్గం అమేధిలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సమయంలో తన తల్లి ,యూపిఏ చైర్ పర్సన్ అయిన సోనియా గాంధి, చెల్లెలు ప్రియాంక వాద్ర వెంటఉన్నారు.అంతకు ముందు మూడు కిలోమేటర్ల మేర ర్యాలి కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది.

భారీ ర్యాలీ నడుమ రాహుల్ గాంధి అమేథిలో నామినేషన్
మూడు కిలోమిటర్ల భారీ ర్యాలీ మధ్య నాల్గవసారి ఉత్తర ప్రదేశ్ లోని అమేధి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధి తన నామినేషన్ ను ధాఖలు చేశారు. కాగా నామినేషన్ సమయంలో రాహుల్ గాంధి వెంట ఆయన తల్లి యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధి సోదరి ప్రియాంక గాంధి వాద్ర,బావా రాబర్ట్ వాద్ర ఉన్నారు. నామినేషన్ ముందు పెద్దెఎత్తున్న ర్యాలి నిర్వహించారు. కాగా ర్యాలీ మున్షిగంజ్ -దర్పిపూర్ నుండి గౌరిగంజ్ వరకు మూడు కిలోమీటర్ల మేర కొనసాగిన కార్యకర్తల ర్యాలిని ఆయన ప్రారంభించారు. ర్యాలీలో రాహుల్ గాంధితో పాటు ప్రియాంక గాంధి, ఆమే భర్త రాబర్ట్ వాద్ర, ప్రియాంక కూతురు మరియా, కొడుకు రెహన్ సైతం పాల్గోన్నారు. కాగా ర్యాలి సమయంలోనే, రాహుల్ నామినేషన్ కు ముందు సోనియా గాంధి అమేథి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది.

గత ఎన్నికల్లో లక్ష మెజారీతో గెలిచిన రాహుల్
కాగా 2014 లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధి ప్రత్యర్థి బీజేపి అభ్యర్థి అయిన స్మృతి ఇరాని పై 1లక్ష 7వేల 903 ఓట్లతో గెలుపోందారు.రాహుల్ గాంధి 4,64,195 ఓట్లను పోందగా స్మృతి ఇరాని 3.07 లక్షల ఓట్లను పోందింది.కాగ అంతకు మందు 2009 ఎన్నికల్లో రాహుల్ 3.7 లక్షల ఓట్ల మెజారిటితో బీఎస్పి అభ్యర్థి అశీష్ శుక్లపై గెలుపోందారు.

వయానాడ్ లో మొదటి నామినేషన్
కాగా రాహుల్ గాంధి రెండు లోక్ సభ నియోజవర్గాల్లో పోటి చేస్తున్న సంగతి తెలిసిందే, తన రెండవ పార్లమెంట్ నియోజకవర్గమైన వయానాడ్ ఆయన గత గురువారం నామినేషన్ ధాఖలు చేశారు.వయానాడ్ లో ఎప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా ఆమేధిలో మే6న పోలింగ్ జరగనుంది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications