‘జననాయగన్’ కు మద్దతుగా రంగంలోకి రాహుల్ - టార్గెట్ మోదీ, కీలక మలుపు..!!
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయంగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. తమిళనాడులో విజయ్ మద్దతు కోసం అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. విజయ్ నటించిన జననాయగన్ వాయిదా పడటం సైతం ఇప్పుడు రాజకీయ టర్న్ తీసుకుంది. తాజాగా ఈ అంశం పైన రాహుల్ గాంధీ ఈ సినిమా విడుదల ఆగటంలో కేంద్రాన్ని టార్గెట్ చేసారు. మోదీ లక్ష్యంగా ట్వీట్ చేసారు. ఇప్పుడు ఈ పరిణామం కీలక మలుపు తీసుకుంటోంది.
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జననాయగన్' కు మద్దతుగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఈ సినిమా సెన్సార్ ఇబ్బందుల వల్ల వాయిదా పడింది. విజయ్ తమిళనాడులో రాజకీయ పార్టీ స్తాపించిన నేపథ్యంలో 'జననాయగన్' మూవీ వాయిదా అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సినిమాను అడ్డుకోవడం అంటేనే తమిళ సంస్కృతిపై దాడి చేయడంగా పేర్కొన్నారు. రాహుల్ ఈ అంశం పై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తమిళ సంస్కృతిపై కేంద్రం దాడి జరుపుతోందని విమర్శించారు. 'జన నాయగన్' సినిమాను అడ్దుకోవడం ద్వారా తమిళ సంస్కృతిపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ దాడి చేస్తోందని రాహుల్ విమర్శించారు. తమిళ ప్రజల వాణిని అణిచివేయాలని మోదీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

పొంగల్ వేళ జనవరి 9న జననాయగన్ విడుదలకు తొలుత ముహూర్తం ఖరారు చేసారు. అయితే, సెన్సార్ చిక్కుల వల్ల సినిమా వాయిదా పడింది. దీనిపై కోర్టును ఆశ్రయించినా.. విడుదలలో జాప్యం తలెత్తింది. అయితే సర్టిఫికేషన్ నిబంధనల పేరుతో కేంద్ర సమాచార, ప్రచార శాఖ సినిమా క్లియరెన్స్‌ను అడ్డుకుందనే ప్రచారం జరుగుతోంది. సామాజిక న్యాయం, రాజకీయ జవాబుదారీతనం, మాస్ లీడర్‌షిప్ వంటి ప్రధాన అంశాలతో పాటు తమిళ రాజకీయ చరిత్ర, సాంస్కృతిక నేపథ్యంతో 'జన నాయగన్' ఈ సినిమా రూపొందించారు. అయితే, సినిమా విడుదల ఆలస్యంతో విజయ్ అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. సినిమా సెన్సార్ చిక్కుల్లో పడటంపై విపక్ష నేతలు, తమిళ సినీ పరిశ్రమ వర్గాలు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారుతున్నారు. విజయ్ మద్దతు పొందేందుకు రెండు ప్రధాన కూటమి లు ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో.. జననాయగన్ ఇప్పుడు రాజకీయ అంశంగా మారుతోంది. దీంతో.. ఇప్పుడు ఈ వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications