విమానంలో తోటి ప్రయాణికులకు రాహుల్ సాయం: సెల్ఫీలు తీసుకున్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెందిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఢిల్లీ-గౌహతి విమానంలో తన తోటి ప్రయాణికులకు సాయమందించారు. వారి లగేజీని ఓవర్‌హెడ్ కేబిన్ స్పేస్‌లో పెట్టేందుకు ఆయన సహకరించడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు.
కొందరైతే ఆ దృశ్యాలను ఫోటోలు తీసుకోగా, మరికొందరు ఉత్సాహంగా రాహుల్‌తో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ తరహాలో రాహుల్ ఫోటోలు సోషల్ మీడియాలో రావడం ఇదే మొదటిసారి కాదు.

గత డిసెంబర్‌లో గుజరాత్ ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లే ఫ్లైట్‌లో ఎక్కేందుకు బోర్డింగ్ క్యూలో రాహుల్ నుంచున్నారు. అప్పట్లో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications