బీహార్ లో రాహుల్ తెల్ల టీ షర్టుల యాత్ర..టార్గెట్ ఇదే..!

ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక అడుగు వేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతూ వారు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్న నేపథ్యంలో వారి కోసం తెల్ల టీషర్టులతో ఓ యాత్ర ప్రారంభించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత అంతా తెల్ల టీషర్టులు ధరించడం ద్వారా ప్రభుత్వంపై ఉద్యోగాల కల్పన కోసం ఒత్తిడి పెంచాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో నిరుద్యోగులతో కలిసి "వలసలను ఆపండి, ఉద్యోగాలు కల్పించండి" పేరుతో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. దీన్ని రాహుల్ గాందీ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలివచ్చిన నిరుద్యోగులతో కలిసి రాహుల్ గాంధీ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరినీ పలకరిస్తూ బీహార్ వీధుల్లో రాహుల్ గాంధీ ఈ యాత్ర నిర్వహించారు. ఈ ఏడాది చివర్లో బీహార్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారు.

Rahul Gandhi launches white T-shirt yatra in bihar to put pressure on government for jobs

బీహార్ యువతలో ఏదో సాధించాలనే ఉత్సాహం ఉందని, మరియు వారికి అవకాశాలు మరియు మద్దతు ఇవ్వనందుకు ప్రభుత్వంపై కోపం ఉందని రాహుల్ గాంధీ ఇవాళ ట్వీట్ చేశారు. "వలసలను ఆపండి, ఉద్యోగాలు కల్పించండి" పేరుతో ప్రారంభించిన ర్యాలీ సందర్భంగా బెగుసరాయ్ వీధుల్లో వేలాది మంది యువత మనోభావాలు, బాధలు మరియు దృఢ సంకల్పం ఈరోజు స్పష్టంగా కనిపించాయన్నారు.

Rahul Gandhi launches white T-shirt yatra in bihar to put pressure on government for jobs


నిరుద్యోగం మరియు వలసలకు వ్యతిరేకంగా ఈ స్వరం ఇప్పుడు మార్పు కోసం నినాదంగా మారిందని రాహుల్ గాంధీ తెలిపారు. బీహార్ ఇప్పుడు మౌనంగా కూర్చోదని, యువత ఇకపై అన్యాయాన్ని సహించదని రాహుల్ తెలిపారు. వారు తమ హక్కులు, ఉపాధి మరియు న్యాయం కోసం పోరాడుతారన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి బీహార్ లో రాహుల్ పర్యటించడం ఇది మూడోసారి. బీహార్ యువత భావోద్వేగాలను ప్రపంచం చూడగలిగేలా బీహార్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తెల్లటి టీ-షర్టు ధరించి తమతో చేరాలని రాహుల్ పిలుపునిచ్చారు. బీహార్ యువత శక్తిని సమీకరించి కొత్త బీహార్‌ను నిర్మిస్తామని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+