వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాహూల్‌కే: వీరప్ప మొయిలీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: వచ్చే నెలలో రాహూల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నట్టు ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ ప్రకటించారు. పార్టీలో మెజార్టీ కార్యకర్తలు కోరుకొంటే నాయకత్వ బాధ్యతలను స్వీకరించేందుకు సిద్దమేనని రాహూల్‌గాంధీ ప్రకటించిన రెండు రోజుల్లో వీరప్పమొయిలీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

సోనియాగాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ఎంపిక చేసుకొనే విషయమై చర్చ సాగుతోంది. అయితే రాహూల్ గాంధీపై కొందరు నేతలు విమర్శలు చేసిన సందర్భంలో వీరప్పమొయిలీ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకొంది.

Rahul Gandhi may like to be Cong president through internal poll: Veerappa Moily


అంతర్గత ఎన్నికల ద్వారా రాహుల్‌ వచ్చే నెలలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశముందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ తెలిపారు. రాహుల్‌ వెంటనే పార్టీ బాధ్యతలు చేపట్టాలి. అప్పుడే పార్టీకి, దేశానికి మంచిది. రాహుల్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఇప్పటికే ఆలస్యమైందని పార్టీలో ప్రతి ఒక్కరు భావిస్తున్నారు' అని మొయిలీ అన్నారు.

అయితే వచ్చే నెలలో రాహుల్‌ పార్టీ బాధ్యతలు చేపడతారా? అని ప్రశ్నించగా.. 'అవును చేపట్టే అవకాశం ఉంది' అని సమాధానమిచ్చారు.
'ఈ విషయంపై అన్ని రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. రాహుల్‌ అధ్యక్షుడిగా ఎన్నికైతే చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. కాంగ్రెస్‌ మరింత పటిష్ఠంగా మారుతుంది' అని వీరప్ప మొయిలీ ధీమాను వ్యక్తం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Senior Congress leader M Veerappa Moily today said Rahul Gandhi would like to emerge as the party president through an internal election process, and hinted that he may assume the charge as early as next month.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి