ఆర్భాటంగా మోదీ రోడ్ షో- అదే రోడ్‌పై సింపుల్‌గా డెలివరీ బాయ్ స్కూటర్‌పై రాహుల్

బెంగళూరు: ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల ప్రచార జోరు పెంచింది. ఇందులో భాగంగా- ఆదివారం బెంగళూరులో ప్రధానమంతరి నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించారు. బెంగళూరులో మోదీ రోడ్ షో నిర్వహించడం వరుసగా ఇది రెండో రోజు. తొలి రోజైన శనివారం 26 కిలోమీటర్లు, ఇవ్వాళ ఏడు కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు.

బెంగళూరు తిప్పసంద్ర కెంపేగౌడ విగ్రహం నుంచి మహాత్మా గాంధీ రోడ్డులోని ట్రినిటీ సర్కిల్ వరకు మోదీ రోడ్ షో సాగింది. తిప్పసంద్ర, బముల్ గేట్, ఇందిరా నగర్ 80 ఫీట్ రోడ్, ఇందిరానగర్, ఈఎస్ఐ ఆసుపత్రి రోడ్, దొమ్మలూరు 12వ మెయిన్ రోడ్, జోగుపాళ్య, చిన్మయానంద మిషన్, లక్ష్మీపుర, హలసూరు మెయిన్ రోడ్ మీదుగా ఎంజీ రోడ్డులోని ట్రినిటీ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించారాయన.

Rahul Gandhi rides a scooter

ఆర్భాటంగా సాగింది మోదీ రోడ్ షో. కాషాయరంగు వాహనంపై నిల్చుని ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. వాహనానికి అన్ని వైపులా మోదీ ఫొటోలను అతికించారు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రజలు పూలను చల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. అభివాదం చేశారు. ఆయన ప్రయాణించిన రోడ్లల్లో పెద్ద ఎత్తున బ్యానర్లను అతికించారు బీజేపీ నాయకులు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

ఇది ముగిసిన కొద్దిసేపటికే అదే బెంగళూరు రోడ్లపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చారు. మోదీ ఆర్భాటంగా ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహించిన అదే బెంగళూరు రోడ్లపై సాదాసీదాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. ఓ డెలివరీ బాయ్ టూవీలర్‌పై కూర్చుని సుమారు మూడు కిలోమీటర్ల మేర ప్రయాణించారు. టూవీలర్‌ను డెలివరీ బాయ్ డ్రైవ్ చేయగా.. దాని వెనకల కూర్చుని ప్రయాణించారు రాహుల్ గాంధీ.

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న విషయం తెలిసిందే. మొత్తం 224 నియోజకవర్గాలకు ఈ నెల 10వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. సోమవారం సాయంత్రం నాటికి ఎన్నికల ప్రచారానికి తెర పడబోతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు.. తమ ప్రచార ఉధృతిని పెంచాయి. ఆయా పార్టీల జాతీయ స్థాయి నాయకులు ఎన్నికల ప్రచార రంగంలో దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+