రాహుల్‌కు నెటిజెన్స్ పంచ్: చిరిగిన చొక్కా కామెంట్స్‌పై ఉతికేస్తున్నారు..
కొత్త కుర్తా కొనుక్కోవడానికి డబ్బుల్లేవుగానీ, విదేశాల్లో సెలవులు గడిపేందుకు డబ్బుంటుందా?'-నెటిజెన్
న్యూఢిల్లీ: తాను పేదలకు ప్రతినిధిని అని చెప్పుకోవాలనే ఉద్దేశ్యంతో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు సోషల్ మీడియా నెటిజెన్స్ కు టార్గెట్ అయింది. చిరిగిన కుర్తా ధరించానంటూ వేదిక మీద నుంచి మాట్లాడిన రాహుల్ పై సోషల్ మీడియాలో నెటిజెన్స్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
కాగా, రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్ లో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన రాహుల్ గాంధీ.. తన ప్రసంగం మధ్యలో దుస్తుల విషయాన్ని ప్రస్తావించారు. చిరిగిన తన కుర్తా జేబులో చెయ్యి పెట్టి చూపిస్తూ.. తాను చిరిగిన చొక్కా వేసుకున్నానని చెప్పుకొచ్చారు.
"నా కుర్తా జేబు చిరిగింది. అయినా ఏమి ఫర్వాలేదు. కానీ, మోడీ ఎన్నడైనా చిరిగిపోయిన దుస్తులు ధరించారా? పదే పదే తాను పేదలకు ప్రతినిధినని చెప్పుకునే మోడీ, పేదలపై రాజకీయాలు చేస్తున్నారు" అని రాహుల్ అభిప్రాయపడ్డారు.

రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా.. రాహుల్ గతంలో సూట్లను ధరించిన ఫోటోలు, చార్టెడ్ విమానాల్లో తిరుగుతున్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేసి నెటిజెన్స్ ఆయన వైఖరిని ఎండగడుతున్నారు.
నెటిజెన్స్ సెటైర్స్ ఇలా:
*'కొత్త కుర్తా కొనుక్కోవడానికి డబ్బుల్లేవుగానీ, విదేశాల్లో సెలవులు గడిపేందుకు డబ్బుంటుందా?'
*'రాహుల్ కుర్తా కొనుక్కునేందుకు తలా ఒక రూపాయి విరాళం ఇద్దాం'
*డియర్ సార్.. చార్టెడ్ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నప్పుడు మీ కుర్తా చిరిగిపోయిందా?
*పైజామా కుర్తా లేదా షేర్వాణీలో రాహుల్ గాంధీ.. ధోతి కుర్తాలో రాబర్ట్ వార్దా
Mera pocket/kurta phata ho toh mujhe farak nahi padta,lekin Modi Ji ka kapda kabhi nahi phata hoga aur vo gareeb ki rajneeti karte hain:RG pic.twitter.com/oDLEIICai0
— ANI (@ANI_news) January 16, 2017
Breaking News: Our beloved Rahul Gandhi(Pappu) doesn't hav proper Kurta, wearing an old one,very unfair.Let's contribute Re1 for clothing RT
— Ravi Saraogi (@ravi_saraogi) January 16, 2017
Dear @OfficeOfRG sir, did your kurta get torn when flying in this chartered plane? pic.twitter.com/6e5KtVN888
— Vijay (@centerofright) January 17, 2017












Click it and Unblock the Notifications