10 శాతం జనాభా చేతుల్లోనే ఆర్మీ..! అగ్రకులాలపై రాహుల్ షాకింగ్ ..!

బీహార్ ఎన్నికల్లో తొలి దశ ప్రచారానికి తెరపడుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ బీహారీల్ని ఆకట్టుకునేందుకు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశంలోని 10 శాతం జనాభా చేతుల్లోనే మన సైన్యం ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అగ్రకులాల్ని ఉద్దేశించి చేసినవే కావడంతో విమర్శలు మొదలయ్యాయి.

బీహార్ లోని కుటుంబలో ఇవాళ ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. "మీరు (ఓటర్లు)నిశితంగా గమనిస్తే.. దేశంలో 90 శాతం మంది జనాభా దళితులు, మహా దళితులు, వెనుకబడిన వర్గాలు, అత్యంత వెనుకబడిన వర్గాలు లేదా మైనారిటీ వర్గాలే. దేశంలో 90 శాతం మంది అత్యంత వెనుకబడిన, గిరిజన వర్గాల వారే" అని రాహుల్ వ్యాఖ్యానించారు.

Rahul Gandhi Sparks Row in Bihar Says 10 Population Dominates Army

అంతటితో ఆగకుండా "మీరు భారతదేశంలోని 500 అతిపెద్ద కంపెనీల జాబితాను తీసుకుంటే, అక్కడ వెనుకబడిన లేదా దళిత వర్గాల నుండి ఎవరూ కనిపించరు, వారందరూ ఆ టాప్ 10 శాతం నుండి వచ్చారు. అన్ని ఉద్యోగాలు వారికే వెళ్తాయి. వారికి సాయుధ దళాలపై నియంత్రణ ఉంటుంది. మిగిలిన 90 శాతం జనాభా ఎక్కడా ప్రాతినిధ్యం వహించడం మీరు చూడలేరు."అంటూ వ్యాఖ్యానించారు.

Rahul Gandhi Sparks Row in Bihar Says 10 Population Dominates Army

అలాగే "దేశ జనాభాలో 90 శాతం మందికి స్థలం ఉన్న, ప్రజలు గౌరవంగా, ఆనందంగా జీవించగలిగే భారతదేశం మాకు కావాలి. కాంగ్రెస్ ఎల్లప్పుడూ వెనుకబడిన వర్గాల కోసం పోరాడుతుంది" అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ మండిపడింది. రాహుల్ గాంధీ ఇప్పుడు సాయుధ దళాలలో కులం కోసం వెతుకుతున్నారని, 10% మంది ప్రజలు దానిని నియంత్రిస్తున్నారని చెబుతున్నారని, ప్రధాని మోడీ పట్ల ఆయనకున్న ద్వేషంలో ఆయన ఇప్పటికే భారతదేశాన్ని ద్వేషించే రేఖను దాటారని బిజెపి నేత సురేష్ నఖువా విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+