Rahul Gandhi: అస్సలు ఊహించలేదు- మహా పరాజయంపై రాహుల్ షాకింగ్..!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కూడిన మహా వికాస్ అఘాడీ కూటమి పరాజయం ఆ పార్టీకి పెద్ద షాక్ గా మారింది. భారీ అంచనాలు పెట్టుకున్న మహారాష్ట్రలో ఇలా బొక్క బోర్తా పడటం నేతలకు అస్సలు మింగుడు పడటం లేదు. గత లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఫలితాలు ఎదురవడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో మహా ఎన్నికల ఫలితాలపై లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు స్పందించారు.

కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మహారాష్ట్ర తీర్పుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోడీని ప్రధానిగా చూడకూడదనుకునే రాష్ట్రం 148 సీట్లలో 132 సీట్లు ఇచ్చిందని పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. అంటే మహారాష్ట్ర బీజేపీని మైనస్ మోడీని కోరుకుంటోందా? ఇది బీజేపీకి ఆందోళన కలిగించే ధోరణి కాదా అని ప్రశ్నించారు. మరోవైపు మహారాష్ట్ర ఫలితాలు అనూహ్యంగా ఉన్నాయని లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్రజల తీర్పును విశ్లేషించుకుంటామన్నారు.

Rahul Gandhi s first reaction on maharastra election loss says unexpected analyse the mandate

మహారాష్ట్రలో ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని వాయనాడ్ ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వోన్నతులని, ఎన్నికల్లో గెలుపు ఓటములు ఉంటాయని తెలిపారు. - గెలుపు ఓటములు రెండింటి నుంచి నేర్చుకుంటామన్నారు. మరోవైపు వాయనాడ్ లో ప్రియాంక గెలుపుపై రాహుల్ స్పందించారు. ప్రియాంక గాంధీ వాద్రాను తమ లోక్‌సభ ప్రతినిధిగా ఎన్నుకున్నందుకు వాయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రియాంక ధైర్యం, దయ, అచంచలమైన అంకితభావంతో ప్రతిష్టాత్మకమైన వయనాడ్‌ను ప్రగతి, శ్రేయస్సుకు దీటుగా మారుస్తారని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+