Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పదవి నుంచి తప్పుకుంటారా? అయితే ప్రత్యామ్నాయం చూపి వెళ్లండి..!

కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాహుల్ గాంధీ రాజీనామాపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించారు. అయితే రాహుల్ నిర్ణయాన్ని పార్టీ నేతలంతా వ్యతిరేకించారు. అధ్యక్ష పదవిలో ఆయనే కొనసాగాలని కోరారు.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పదవి నుంచి తప్పుకునే అంశంపై సస్పెన్స్ నెలకొంది.ఇదిలా ఉంటే గాంధీ కుటుంబానికి చెందిన వారే కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాల్సిన అవసరంలేదన్న రాహుల్ వ్యాఖ్యలు పార్టీ సీనియర్లలో కొత్త ఆశలు రేపాయి. దీంతో ప్రెసిడెంట్ పదవి తమకు అప్పగించాలంటూ నేతలు పరోక్ష సంకేతాలివ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంగా పార్టీ పగ్గాలు తనకు అప్పగించాలంటూ సీనియర్ నేత అస్లాం షేర్ ఖాన్ బహిరంగంగానే కోరారు.

Rahul must find replacement, if he wants to leave

తాజాగా పదవి నుంచి తప్పుకునే విషయంలో రాహుల్ గాంధీ స్పష్టతనివ్వాలని, ఒకవేళ పదవి నుంచి వైదొలగితే ప్రత్యామ్నాయం చూపి వెళ్లాలని కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ తప్పుతోందని, వివిధ రాష్ట్రాల్లో నాయకుల్లో అసంతృప్తి నెలకొని ఉందన్నది మొయిలీ వాదన. ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ ఏం మాట్లాడకుండా ఉంటే పార్టీ ప్రతిష్ఠకు, ఉనికికి ప్రమాదంలో పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాహుల్ గాంధీ కచ్చితమైన నిర్ణయం ప్రకటించాల్సిన సమయం వచ్చిందన్న వీరప్ప మొయిలీ ఒకవేళ అధ్యక్ష పదవిని వదిలేయాలనుకుంటే సరైన వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఒకట్రెండు సార్లు ఘోరంగా వైఫల్యం చెందామంటే వ్యూహాల్లో లోపముందని గ్రహించాలని, వైఫల్యానికి కారణాలు కనిపెట్టి వాటిపై దృష్టి సారించాలని పరోక్షంగా చురకలంటించారు. కొత్త ప్రెసిడెంట్‌ను నియమించాలని నిర్ణయిస్తే ఆ నేతను రాహులే ఎంపిక చేయాలని వీరప్పమొయిలీ సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+