బుల్లితెర 'ఆనంది' మృతి: అందరి వేళ్లూ ప్రియుడివైపే..!

ముంబై: ప్రోడ్యూసర్, బాయ్ ప్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ తన కూతురు జీవితాన్ని సర్వనాశం చేశాడని బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ తండ్రి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాహుల్ రాజ్ సింగ్ వచ్చాకే తన కుమార్తె హింసకు గురైందని ఆయన కన్నీటిపర్యంతమయ్యాడు.

శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె చావుకి కారణమైన రాహుల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని అన్నాడు. మరోవైపు ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నానని ఆమె సోదరి రిషిత ఆవేదన వ్యక్తం చేసింది.

Rahul raj singh destroyed my daughters life says pratyusha father shankar

'ఆ సమయంలో నేను టూషన్ క్లాస్‌లో ఉన్నాను. ఇంటికి తిరిగి వచ్చాక, అందరూ ఏడుస్తున్నారు. నా సోదరి ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నా. ఆమె ఈ పని చేసుండదు' అని రిషిత చెప్పింది. మా టీవిలో డబ్బింగ్ సీరియల్ చిన్నారి పెళ్లికూతురులో ఆనందిగా తెలుగు టీవీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ప్రత్యూష శుక్రవారం మరణించింది.

ముంబై శివార్లలోని బంగూర్‌నగర్‌లో ఉన్న సొంత ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సిద్ధార్థ్ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రత్యూష మరణానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని, విచారిస్తున్నామని ముంబై పోలీసులు చెప్పారు.

ప్రత్యూషది హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం అసలు నిజం బహిర్గతమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ప్రత్యూష మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నా, సన్నిహితులు మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని సహనటి పాల్ డాలీ బింద్రా చెప్పారు. బిగ్ బాస్‌లో ప్రత్యూషతో కలిసి నటించిన అజీజ్ ఖాన్ మాట్లాడుతూ ఇది కచ్చితంగా ముందస్తు ప్రణాళిక ఆధారంగానే చేసిన మర్డర్ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రత్యూష మృతదేహంపై మెడ, ఎడమ చెంపపై గాయాలు ఉండటం, నోటినుంచి రక్త రావడంతో ప్రత్యూషది హత్యేనని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్, ఆమె చనిపోయినపుడు ఆసుపత్రిలో ప్రశాంతంగా కనిపించడం, అనంతరం ప్రత్యూష తల్లిదండ్రులకు విమాన టికెట్లు బుక్ చేసి పరారీలో ఉండడంతో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+