వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌పై రాహుల్‌వి నిరాధారమైన వ్యాఖ్యలు: కేంద్రహోంశాఖ

|
Google Oneindia TeluguNews

సెప్టెంబర్ 22న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓసమావేశంలో మాట్లాడారు . ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నియమించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఛీఫ్‌ రాజీనామా చేయాల్సి వచ్చిందని ఇందుకు కారణం ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ఎస్పీజీ ఆఫీసర్ల జాబితాకు ఆయనకు ఆమోదం తెలపకపోవడమేనని రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై ఆ ఆఫీసర్ స్పందించారు.

ఎస్పీజీ మాజీ డైరెక్టర్‌ వివేక్ శ్రీవాత్సవను ఉద్దేశించి రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై శ్రీవాత్సవ స్పందించారు. రాహుల్ గాంధీకి తాను ఎప్పుడూ ఈ విషయమై మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. తన విధుల్లో భాగంగా తాను ఎస్పీజీ కమాండోలతో మాట్లాడినట్లు తెలిపిన శ్రీవాత్సవ్... ఎస్పీజీకి నూతన డైరెక్టర్ నియామకం అవడం తాను ఎస్పీజీ డైరెక్టర్‌గా తప్పుకోవడానికి ఎలాంటి సంబంధం లేదని.. రాహుల్ గాంధీతో కూడా ఈ విషయమై తాను ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు.

 Rahul statement on SPG is baseless, says MHA

పదవిలో ఉన్న ప్రధానమంత్రులను, మాజీ ప్రధానిలను వారి కుటుంబ సభ్యులకు ఎస్పీజీ దళాలు రక్షణ కల్పిస్తాయి. చాలా అంకిత భావంతో ఎస్పీజీ దళాలు పనిచేస్తాయి. అయితే మీడియా ముందు ఎస్పీజీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని, సత్యదూరమైన వ్యాఖ్యాలని.. అవి దురదృష్టకర వ్యాఖ్యలని కేంద్రహోంశాఖ కార్యాలయం మండిపడింది.

English summary
It has been reported in a section of the media that Rahul Gandhi, during an interaction at New Delhi on Saturday (Sept 22), had commented that "The SPG Chief appointed by the Prime Minister Narendra Modi had to quit because he refused to accept a list of SPG officers handpicked by the RSS".Vivek Srivastava, former Director, Special Protection Group (SPG), has specifically averred that he did not have any such conversation with Rahul Gandhi at any point of time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X