కేరళంలో 5 గ్యారంటీలను ప్రకటించిన రాహుల్ గాంధీ..
కేరళం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ UDF తరఫున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 5 గ్యారంటీలను ప్రకటించారు. కేరళం రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, అలాగే కాలేజీ అమ్మాయిలకు ప్రతి నెల రూ. 1000 అందజేత, వెల్ఫేర్ పెన్షన్ రూ. 3,000 లకు పెంపు, ఇక ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ .. దాంతో పాటు బిజినెస్ చేయాలనుకునే యువతకు రూ. 5 లక్షల వడ్డీ లేని రుణాలు అందజేత.. అలాగే సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు.. ఇలా 5 గ్యారంటీలను రాహుల్ గాంధీ ప్రకటించారు.
కేరళంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేరళంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) తరపున ప్రచారాన్ని వేగవంతం చేశారు. అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) చేపడుతున్న సంక్షేమ పథకాలకు పోటీగా రాహుల్ గాంధీ పలు కీలక హామీలను ప్రకటించారు. ఐదు గ్యారంటీల పేరుతో ఈ పథకాలను తీసుకొచ్చారు.
కేరళలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే UDF ప్రధాన లక్ష్యమని రాహుల్ స్పష్టం చేశారు. LDF ప్రభుత్వ విధానాల వల్ల పెట్టుబడులు రావడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని రైతులు, కార్మికులు, యువత నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగానే UDF మ్యానిఫెస్టోను రూపొందించిందని రాహుల్ గాంధీ తెలిపారు. కనీస ఆదాయ హామీ పథకం (NYAY) ద్వారా పేదలకు నేరుగా నగదు బదిలీ చేస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రస్తుతం పినరయి విజయన్ ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కిట్లు, పెన్షన్ల కంటే ఈ పథకం బెటర్ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

పినరయి విజయన్ ప్రభుత్వం కేవలం తమ పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ ఉద్యోగాలను కట్టబెడుతోందని.. అర్హులైన యువతకు అన్యాయం జరుగుతోందని రాహుల్ గాంధీ కీలక ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదు గ్యారంటీలను రాహుల్ గాంధీ ప్రకటించారు. KSRTC బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ.. కాలేజీ అమ్మాయిలకు ప్రతి నెలా రూ.1,000.. అలాగే వెల్ఫేర్ పెన్షన్ రూ.3,000లకు పెంపు.. ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. బిజినెస్ చేయాలనుకునే యువతకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు తదితర పథకాలు ఉన్నాయి.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications