• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వేబడ్జెట్: హైస్పీడ్ రైళ్లు, హైద్రాబాద్ సహా.. చతుర్భుజి

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ రైల్వే బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి.

Railway Budget (live updates): Sadananda Gowda head for Railway Bhavan, refusing to say a word

రైల్వే బడ్జెట్ అనంతరం నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్‌లో పారదర్శకత, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు. దేశ అభివృద్ధిలో రైల్వేలది కీలక పాత్ర అన్నారు. తక్కువ సమయంలో దిశానిర్దేశనం చేసిన బడ్జెట్ ఇదే అన్నారు. దేశాభివృద్ధి పట్ల విశ్వాసం కలిగించిన బడ్జెట్ అన్నారు.

కొత్తగా.. 5 జన సాధారణ్, 5 ప్రీమియం, 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 8 ప్యాసింజర్లు, 2 మెమూ, 5 డెమూ సర్వీస్‌లు

తోమ్మిది మార్గాల్లో హైస్పీడ్ రైళ్లు. రైల్వే టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు.

నాణ్యత పాటించకుంటే కఠిన చర్యలు.

ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు అల్ట్రా సోనిక్ సిస్టమ్.

ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ రైల్వే లైన్లు. విద్యార్థులకు ప్రత్యేక రాయితీలు.

మెజారిటీ ప్రాజెక్టులకు పీపీపీ మోడల్ ద్వారా నిధులు. ప్రయాణీకుల భద్రతకు సీసీ కెమెరాల ఏర్పాటు.

రైల్వేల నాణ్యత పెంపునకు రైల్వే విశ్వవిద్యాలయం.

పారిశుద్యానికి 40 శాతం నిధులు. మెట్రో నగరాలను కలుపుతూ వచ్చే వజ్ర చతుర్భుజికి 9 లక్షల కోట్ల అంచనా.

రైలు ప్రయాణీకులకు మొబైల్ అలర్ట్ సేవలు.

కీలక స్టేషన్లలో వైఫై సదుపాయం.

రైల్వే ఆస్తులకు ప్రహరీ కోడలు. మెట్రో నగరాల్లోని పది రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ ప్రమాణాలు. పీపీపీల ద్వారా సాగరమాల పేరుతో పోర్టుల అనుసంధాన లైన్లు.

ప్రయాణీకులకు ప్రయాణ సమయం గుర్తించే సూచిక.

ఈ ఏడాది రూ.602 కోట్ల మిగులు ఆదాయమే లక్ష్యం.

ఐదేళ్లలో పేపర్ లెస్ కార్యాలయాలు. సరకు రవాణా ఛార్జీలను ఇంధన ఖర్చులకు అనుగుణంగా పెంచుతాం.

నిమిషానుకు 7,200 టిక్కెట్లు ఇచ్చేలా ఈ టిక్కెట్ బుకింగ్ విధానం అభివృద్ధి చేస్తాం.

అన్ని ఏ కేటగిరీ రైళ్లలు ఉచిత వై ఫై సౌకర్యాలు. రైల్వే రిజర్వేషన్ల కోసం పోస్టాఫీసులను కూడా వాడుకుంటాం. సెల్‌ఫోన్లతోను రిజర్వేషన్.

ముంబై - అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ రైలు.

రైల్వే రిజర్వేషన్ విధానం మారుస్తాం. అన్ని మెట్రో నగరాలను కలుపుతూ మెట్రో చతుర్భిజి లైన్.

రైళ్ల స్పీడ్‌ను 160 కి.మీ. నుండి 200కు పెంచుతాం. నాలుగువేల మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల నియామకం.

వృద్ధులు, వికలాంగులను స్టేషన్లకు తీసుకు వచ్చేందుకు బ్యాటరీ వాహనాలు.

కేటరింగ్ సర్వీస్ నాణ్యత పెంచుతాం. రైల్వేలకు కేంద్రం పదకొండువందల కోట్ల రూపాయల సాయం చేసింది.

సాధ్యమైనంత త్వరలో బుల్లెట్ రైలు.

2014-2015కు రూ.1.64 లక్షల రైల్వే టర్నోవర్‌గా అంచనా.

ధరల పెంపుపై నిర్ణీత కాలంలో సమీక్ష జరగాలి. ప్రయివేటు భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాల కల్పన.

ఇటీవల పెంచిన ధరల వల్ల ఎనిమిదివేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. భారతీయ రైల్వేలు వాణిజ్య సంస్థగా కాకుండా ప్రజాహితంగా పని చేస్తాయి.

రూ.1,57,888 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆమోదం పొందాయి.

డబ్లింగ్, ట్రిప్పింగ్‌కు మొదటి ప్రాధాన్యం. ముప్పై ఏళ్లుగా సగంలోనే ఆగిన ప్రాజెక్టులు నాలుగు ఉన్నాయి. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రెండో ప్రాధాన్యత.

ఏడాదలో రైల్వే వ్యవస్థను గాడిలో పెడతాం.

రైల్వే ఆదాయంలో 94 శాతం ఖర్చు చేస్తున్నాం. సరకు రవాణాలో తగ్గుదల కనిపిస్తోంది. 676 రైల్వే ప్రాజెక్టులో ఆమోదిస్తే 356 మాత్రమే పూర్తయ్యాయి.

గత పదేళ్లలో 41వేల కోట్ల రూపాయలతో 3700 కిలోమీటర్ల కొత్త లైన్ల నిర్మాణం జరిగింది. 12,500 రైళ్లతో సురక్షిత ప్రయాణం అందిస్తున్నాం.

ప్రాజెక్టుల ఆమోదం పైనే తప్ప పూర్తి విషయాల పైన దృష్టి కొరవడింది. రైల్వే సామాజిక బాధ్యతను మరవలేదు.

రైల్వేలలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తాం.

ప్రజల పైన భారం వేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి.

రైల్వే ద్వారా వచ్చిన ఆదాయంలో రూపాయికి 90 పైసలు ఖర్చు పెడుతున్నాం.

భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే ఆత్మ లాంటింది. సరకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామి కావడమే లక్ష్యం.

పెండింగ్ ప్రాజెక్టుల కోసం 1.82 లక్షల కోట్లు కావాలి.

కొత్త రైళ్లు, కొత్త లైన్ల కోసం ఎంపీల నుండి ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయి. 359 ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది. హైస్పీడ్ నెట్ వర్క్ నెలకొల్పుతాం

భారత దేశ అభివృద్ధిలో రైల్వేలది కీలక పాత్ర.

సేఫ్టీ, స్పీడ్, సెక్యూరిటీ మా ప్రభుత్వ ప్రాధాన్యత. రైల్వే రోజుకు రెండు కోట్ల 30 లక్షల మందిని గమ్యానికి చేరుస్తోంది.

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైల్వే అనుసంధానం.

దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వేలు అత్యంత కీలకం. రక్షణ, సరకు రవాణాలో రైల్వేలది కీలక పాత్ర.

సదానంద గౌడ రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టారు. మోడీకి కృతజ్ఞతలు చెబుతూ సదానంద ప్రసంగాన్ని ప్రారంభించారు.

రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తన జూనియర్ మంత్రి మనోజ్ సిన్హాతో కలిసి పార్లమెంటుకు వచ్చారు.

మంత్రి అనంత్ కుమార్ మాట్లాడుతూ... రైతులకు పంటలు, నేలకు సంబంధించిన విషయమై అవగాహన కల్పిస్తామని చెప్పారు.

యూరియా, ఫెర్టిలైజర్స్ ధరల పెంపు ఉండదని సంబంధిత శాఖ మంత్రి చెప్పారు. అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని చెప్పారు.

పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఉత్కంఠ ఉంది.

పార్లమెంటుకు చేరుకున్న బడ్జెట్ ప్రతులు.

లోకసభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది.

పార్లమెంటు సమావేశాలు పదకొండు గంటలకు ప్రారంభమయ్యాయి.

పార్లమెంటరీ బోర్డు సమావేశం పది నలభై అయిదు నిమిషాలకు ముగిసింది. విపక్షాలు చర్చకు సహకరించాలని ప్రకాశ్ జవదేకర్ కోరారు.

ఢిల్లీలో సదానంద గౌడ మాట్లాడుతూ... రైల్వేలను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చుతామని చెప్పారు. ఈ బడ్జెట్‌లో బుల్లెట్ రైళ్లను ప్రవేశ పెడుతున్నామన్నారు.

English summary
It has not been easy for the newly-formed government as it approaches its 100-day threshold. Surely, it is encountering numerous problems that were till now brushed under the carpet by its predecessors, creating an illusion of a people's government. We knew that the railways was running at a loss, but who knew that it was running a debt too and a loss of Rs 26,000 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X