అమానుషం: యువకుడికి మూత్రం తాగించి, నగ్నంగా ఊరేగించి చిత్రహింసలు!
సభ్యసమాజం తలదించుకునే ఓ అమానుష ఘటన రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగు చూసింది. ప్రేమ వ్యవహారంపై ఆగ్రహంతో ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన యువతి కుటుంబ సభ్యులు అతడిని చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా బలవంతంగా మూత్రం తాగించి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు.
అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు చెందిన సోను(18) అనే యువకుడు రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాకు చెందిన ఓ యువతి ప్రేమలో ఉన్నారు.సుమారు 15 రోజుల క్రితం ఆ యువతి భోపాల్‌కు వచ్చి సోనుతో కలిసి ఉంది. అయితే కుటుంబ సభ్యుల జోక్యంతో ఆమె తిరిగి రాజస్థాన్‌కు వెళ్లిపోయింది. ఇటీవల సదరు యువతి నుంచి ఫోన్ రావడంతో ఆమెను కలవడానికి సోను ఝాలావర్ జిల్లాలోని పులోరో గ్రామానికి వెళ్లాడు. కానీ అది అతడిని పట్టుకోవడానికి వేసిన ప్లాన్ అని సోను గ్రహించలేకపోయాడు.

చిత్రహింసల పర్వం
సోను గ్రామానికి చేరుకోగానే యువతి కుటుంబ సభ్యులు అతడిని కిడ్నాప్ చేసి, మూడు రోజుల పాటు బందీగా ఉంచారు. ఒక బీరు సీసాలో మూత్రాన్ని నింపి, సోనుతో బలవంతంగా తాగించారు. అతడిని నగ్నంగా చేసి గంటల తరబడి కొడుతూ, తన్నుతూ పైశాచికానందం పొందారు. ఈ దారుణాన్నంతా వీడియో తీసి, భయపెట్టేందుకు భోపాల్‌లోని సోను కుటుంబ సభ్యులకు పంపారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
#दांगीपुरा_JHALAWAR
— INDIA NEWS RAJASTHAN (@raj_indianews) January 18, 2026
झालावाड़ के दांगीपुरा में शादीशुदा प्रेमिका से मध्यप्रदेश से मिलने आए नाबालिग को महिला के ससुराल वालों ने बंधकर बनाकर पिटाई एंव बोतल में तरल पदार्थ पिलाने का मामला आया सामने, पिटाई एंव बोतल में कुछ तरल@JhalawarPolice pic.twitter.com/fI13Ij1S7Q
పోలీసుల చర్యలు
వీడియో చూసి షాక్‌కు గురైన సోను కుటుంబ సభ్యులు వెంటనే భోపాల్‌లోని కోలార్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన పోలీసులు.. రాజస్థాన్ పోలీసులతో సమన్వయం చేసుకుని సోనును రక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ సోనీ మాట్లాడుతూ.. "బాధితుడి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నాం. వీడియోను కూడా పరిశీలిస్తున్నాం. కిడ్నాప్, అక్రమ నిర్బంధం, చిత్రహింసలు వంటి పలు సెక్షన్ల కింద నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం." అని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ప్రేమికుల మధ్య గొడవలను చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇలాంటి అమానుష మార్గాల్లో తీర్చుకోవడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications